30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ఈనెల 29న

మోస్ట్ ఎనర్జిటిక్ మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. తన మాటలతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అనతి కాలంలోనే అత్యధిక ప్రేక్షకాదరణను చూరగొన్నాడు. అడపా దడపా చిన్న చిన్న పాత్రలతో వెండి తెరమీద మెరిసినా పూర్తి స్థాయిలో హీరోగా చేస్తున్న మొదటి చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ఇప్పటికే ఈ చిత్రంలోని పాట నీలి నీలి ఆకాశం పెద్ద హిట్. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది.
అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. అనూప్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కరోనా లాక్‌డౌన్ కారణంగా చిత్రం రిలీజ్ డేట్ వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకున్నందున సినిమాని విడుదలచేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో ప్రదీప్ లవ్ గురూగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com