Tollywood: అన్నపూర్ణ ఫోటో స్టూడియో' లో విజయ్ దేవరకొండ ఫోటో

Tollywood: అన్నపూర్ణ ఫోటో స్టూడియో లో విజయ్ దేవరకొండ ఫోటో
'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' ట్రైలర్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది

"అన్నపూర్ణ ఫోటో స్టూడియో" ట్రైలర్ రిలీజ్ చేశాడు హీరో విజయ దేవరకొండ. టీమ్ కి అభినందనలు చెప్పిన విజయ్ సినిమా సక్సెస్ కావాలని కోరాడు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించగా... చెందు దర్శకత్వం వహించారు. చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. .

విజయ్ దేవర కొండ మాట్లాడుతూ : అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని అన్నాడు. కామెడీ, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ డ్రామా ఇలా అన్నీ ఉన్నాయని చెప్పాడు. ఇక 80, 90ల నేపథ్యాన్ని ఎంచుకోవడంతో ఓ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందని అన్నాడు. నాటి వాతావరణాన్ని చక్కగా క్రియేట్ చేశారని అన్నాడు. పాటలు, నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపాడు.

యశ్ రంగినేని మాట్లాడుతూ.. "విజయ్ ఎప్పుడూ కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నాడు. 'అన్నపూర్ణ ఫోటో స్టూడియోస్‌'ను సపోర్ట్ చేసినందుకు థాంక్స్. రెట్రో ఫీలింగ్‌ను తీసుకు రావాలనే ఇలాంటి బ్యాక్ డ్రాప్‌ను ఎంచుకున్నాం. మంచి సంగీతం ఈ సినిమాకు లభించింది. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ఆడియెన్స్ నిర్ణయిస్తారు. ఈ సినిమాను చూసి ప్రేక్షకుల తమ అభిప్రాయాన్ని చెప్పాలి. ప్రథమార్థం అంతా కూడా ఎంతో ఫన్నీగా ఉంటుంది. సెకండాఫ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుంది. జూలై 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పక చూడండి" అని అన్నారు.

దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. "ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండకు థాంక్స్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, ఫన్‌గా నడుస్తుంది. సెకండ్ హాఫ్‌లో ట్విస్టులుంటాయి. సంక్రాంతి హాలీడేలకు ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. పాటలు బాగా వచ్చాయి. ఈ జూలై 21న సినిమా విడుదల కాబోతోంది. అందరూ తప్పక చూడండి" అని అన్నారు.

చైతన్య రావ్ మాట్లాడుతూ.. "విజయ్ దేవరకొండ మాలాంటి వాళ్లకు స్పూర్తి. నా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన విజయ్‌కు థాంక్స్. పెళ్లి చూపులు సినిమాను థియేటర్లో చూశాను. ఇప్పుడు ఆ సినిమా నిర్మాతతోనే పని చేస్తున్నాను. 80, 90ల నేపథ్యాన్ని మళ్లీ గుర్తు చేయాలని ఈ సినిమాను తీశాం. ఈ మూవీ అద్భుతంగా వచ్చింది. సంగీతం బాగుంటుంది. జూలై 21న ఈ సినిమా రాబోతోంది. అందరూ తప్పక చూడండి" అని అన్నారు.

హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.."ట్రైలర్‌ను లాంచ్ చేసినందుకు విజయ్ దేవరకొండ గారికి థాంక్స్. ఇప్పటికే పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌ కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. జూలై 21న మా చిత్రం విడుదల కాబోతోంది. అందరూ చూడండి" అని అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story