Anushka Shetty: ఇండస్ట్రీలో అనుష్కకు 17 ఏళ్లు.. స్పెషల్ పోస్ట్ షేర్..

Anushka Shetty: ఇండస్ట్రీలో అనుష్కకు 17 ఏళ్లు.. స్పెషల్ పోస్ట్ షేర్..
Anushka Shetty: పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సూపర్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అనుష్క.

Anushka Shetty: సినీ పరిశ్రమల్లో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. తనకు సినిమా ఆఫర్లు వస్తున్నా కూడా అనుష్క మాత్రం తనంతట తానుగా అన్నింటికి దూరమయ్యింది. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న అనుష్క.. ఇఫ్పుడు పూర్తిగా సినిమాలకు దూరమవ్వడం తన ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. ఇదే సమయంలో తను ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అయ్యిందంటూ అనుష్క ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.


పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సూపర్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అనుష్క. అందులో తను చేసింది సెకండ్ హీరోయిన్‌గానే అయినా.. స్టైలిష్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత 'మహానంది'తో హీరోయిన్‌గా మారింది. కెరీర్ మొదట్లోనే రాజమౌళిలాంటి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కంట్లో పడింది. తన డైరెక్షన్‌లో 'విక్రమార్కుడు' సినిమాలో నటించిన తర్వాత అనుష్క కెరీర్ టర్న్ అయిపోయింది.


అనుష్క కెరీర్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో సినిమా 'అరుంధతి'. కోడి రామక‌ృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. అనుష్క కెరీర్‌లో బిగ్ బ్రేక్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తను కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. స్వీటీ చివరిగా 'నిశ్శబ్ధం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా డిస్టాస్టర్‌గా నిలిచింది. అప్పటినుండి అనుష్క సినిమాలకు దూరమయ్యింది.

తాజాగా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు పూర్తవ్వడంతో కేక కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది స్వీటీ. '17 ఏళ్లుగా నిరంతరం ఫ్యామిలీ దగ్గర నుండి, స్నేహితుల దగ్గర నుండి, ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ప్రేమ, సపోర్ట్ పొందుతూనే ఉన్నాను. నా జీవితంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ మనస్పూర్తిగా థాంక్యూ. మీ ప్రేమ గురించి చెప్పడానికి నాకెప్పుడూ మాటలు చాలవు' అంటూ ఓ క్యాప్షన్‌ను జతచేసింది అనుష్క.


Tags

Read MoreRead Less
Next Story