కడుపు తీపితో వచ్చే దు:ఖాన్ని ఎవరూ ఆపలేరు .. బాబుమోహన్ ఎమోషనల్..!

తాజాగా మెగా హీరో సాయిధరమ్‌ ‌తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం అపోలో అసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు.

కడుపు తీపితో వచ్చే దు:ఖాన్ని ఎవరూ ఆపలేరు .. బాబుమోహన్ ఎమోషనల్..!
X

తాజాగా మెగా హీరో సాయిధరమ్‌ ‌తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం అపోలో అసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉండని వైద్యులు వెల్లడించారు. అయితే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై సినీ నటుడు బాబుమోహన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు బాబుమోహన్.

సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ వార్త విన్న వెంటనే నాకు ఆనాటి సంఘటన గుర్తొచ్చిందని అన్నారు బాబుమోహన్ . ఈ సందర్భంగా స్పోర్ట్స్‌ బైక్‌ ప్రియులకు పలు సూచనలు కూడా చేశారాయన. సాయి హెల్మెట్‌ పెట్టుకుని మంచి పనిచేశాడని, కొందరు హెల్మెట్ పెట్టుకునేందుకు ఇష్టపడారని, అది మంచి పద్ధతి కాదని అన్నారు. రోడ్డుపై నిర్లక్ష్యంగా బైక్‌ నడిపి ప్రమాదం బారిన పడితే దాని ప్రభావం కుటుంబ సభ్యుల పైన పడుతుందని అన్నారు.

ఆ బాధ కుటుంబ సభ్యులకి జీవితాంతం ఉంటుందని అన్నారు. కడుపు తీపితో వచ్చే దు:ఖాన్ని ఎవరూ ఆపలేరని ఎమోషనల్ అయ్యారు బాబు మోహన్. కుటుంబాన్ని గుర్తు చేసుకుని మరీ బైకులు నడపాలని అన్నారు. ప్రాణాల‌తో ఎవ‌రు చెల‌గాటం ఆడొద్దని, తల్లిదండ్రులకి మానసిక క్షోభ పెట్టొద్దని కోరారు. కాగా బాబు మోహన్ పెద్ద కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబరు 13న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Next Story

RELATED STORIES