ఒకే రోజున రెండు సినిమాలతో పోటీపడ్డ బాలయ్య.. ఒకటి హిట్టు, ఇంకోటి ఫట్టు..!

ఒకే రోజున రెండు సినిమాలతో  పోటీపడ్డ బాలయ్య.. ఒకటి హిట్టు, ఇంకోటి ఫట్టు..!
ఒక హీరో నటించిన సినిమాలు ఒకే నెలలో విడుదల అవ్వడం అనేది సర్వసాధారణ విషయమే కానీ... ఒక హీరో నటించిన సినిమాలు ఒకే నెలలో ఒకే రోజున విడులవ్వడం అనేది అసాధారణం.

ఒక హీరో నటించిన సినిమాలు ఒకే నెలలో విడుదల అవ్వడం అనేది సర్వసాధారణ విషయమే కానీ... ఒక హీరో నటించిన సినిమాలు ఒకే నెలలో ఒకే రోజున విడులవ్వడం అనేది అసాధారణం అని చెప్పాలి. కానీ ఇలాంటి రెర్ ఇన్సిడెంట్ నందమూరి నటసింహం బాలకృష్ణకి ఓ సారి ఎదురైంది. బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు చిత్రాలు 1993లో సెప్టెంబర్ 03న రిలీజై సంచలనం సృష్టించాయి. అయితే ఇందులో నిప్పురవ్వ ప్లాప్ అవ్వగా, బంగారు బుల్లోడు సూపర్ హిట్ అయింది.

బాలకృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా నిప్పురవ్వ చిత్రం తెరకెక్కింది. కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అప్పట్లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే కావడం విశేషం. బాలకృష్ణకి ఇదే తొలి 70mm సినిమా కావడం మరో విశేషం. అభిమానులకి ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. విజయశాంతి, బాలకృష్ణ హిట్ ఫెయిర్ కావడం, మళ్లీ ఈ సినిమాకి విజయశాంతి ప్రొడ్యూసర్ అవ్వడం, వరుస హిట్లతో సక్సెస్ఫుల్ దర్శకుడిగా మంచి పేరున్న కోదండరామిరెడ్డి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

కర్తవ్యం లాంటి సూపర్ హీట్‌‌తో ఉన్న విజయశాంతి ఇందులో ఎక్కువగా కామెడీ రోల్‌‌లో కనిపించడం ప్రేక్షకులకి నచ్చలేదు. సినిమా మొదట్లో ఎలుగుబంటిని చూసి భయపడ్డ హీరోయిన్ సినిమా చివర్లో సీరియస్‌‌గా ఫైట్స్ చేయడం విమర్శలకు దారితీసింది. అయితే దీనివెనుక కథ వేరే ఉంది .ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విజయశాంతి కర్తవ్యం తమిళ రీమేక్ వైజయంతి ఐపీఎస్ గా రిలీజై సూపర్ హిట్ అయింది. అలాంటిది నిప్పురవ్వ సినిమాలో విజయశాంతి రోల్ కామెడీగా ఉండడంతో దెబ్బతింటామని బయ్యర్లు భయపడ్డారు. అందుకే నిప్పురవ్వ క్లైమాక్స్ లో విజయశాంతితో ఫైట్లు చేయించారు. ఇదే తేడా కొట్టింది.

ఇక బంగారు బుల్లోడు సినిమా విషయానికి వస్తే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రమ్యకృష్ణ, రవీనా టాండన్ హీరోయిన్లుగా నటించారు. బాలకృష్ణ తో రమ్యకృష్ణ ఇది తొలి చిత్రం కాగా, రవీనాటాండన్ కి టాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. జగపతి ఆర్ట్స్ పిక్చర్ పై వి.బి.రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో ఆయన తెరకెక్కించిన దసరా బుల్లోడు, బంగారు బాబు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అందుకే ఈ చిత్రానికి బంగారు బుల్లోడు అనే టైటిల్ ని పెట్టారాయిన. ఈ సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

ఇలా ఒకేరోజున తన రెండు సినిమాలతో తనతో తానే పోటీ పడ్డారు బాలకృష్ణ.. అయితే ఈ రెండు సినిమాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే... ఈ రెండు సినిమాలకి రాజ్ కోటి మ్యూజిక్ చేశారు. కానీ నిప్పురవ్వ కంటే బంగారు బుల్లోడు మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇలాంటి ఇన్సిడెంట్ బాలకృష్ణ తండ్రి సీనియర్ ఎన్టీఆర్ కి కూడా ఓ సారి ఎదురైంది. ఆయన నటించిన సతీసులోచన, పెండ్లిపిలుపు చిత్రాలు1961 మే 05న ఓకేరోజున విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే అప్పుడు ఇంతటి పోటీ లేకపోవడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story