Balayya: ANRపై ప్రేమ గుండెల్లో ఉంటుంది
అక్కినేని నాగేశ్వరరావుపై చేసిన వాఖ్యల పట్ల బాలయ్య స్పందించారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో "అక్కినేని తొక్కినేని" అని బాలయ్య మాట్లాడగా అదికాస్త వివాదానికి దారితీసింది. అతని మాటల పట్ల నాగ చైతన్య కూడా స్పందిస్తూ ఓ లేఖను విడదల చేసిన విషయం తెలిసిందే. కాగా గురువారం హిందూపురంలో పర్యటించిన బాలయ్య ఆ వాఖ్యల పట్ల స్పందిస్తూ.. వీర సింహారెడ్డి సక్సెస్ మీట్‌లో యాదృచ్చికంగా ఆ మాట వచ్చిందన్నారు. తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ రెండు కళ్లలాంటివారని తెలిపారు. ఎన్టీఆర్ మరణించిన తరువాత ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొదటిసారిగా నాగేశ్వరరావుకు ఇచ్చామని వెల్లడించారు. ఏయన్నార్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుందని, బయట ఏమి జరిగిన నేను పట్టించుకోను, ఫ్లోలో అన్నమాటలను వేరే విధంగా ప్రచారం చేస్తే నాకు ఎలాంటి సంబంధం లేదని బాలయ్య స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com