ఈ కామెడీ సీన్ కోసం ఆయన ఫోన్ నెంబర్ వాడేశారట!

మహేష్ బాబు, భూమిక హీరోహీరోయిన్లుగా వచ్చిన ఒక్కడు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎంఎస్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

ఈ కామెడీ సీన్ కోసం ఆయన ఫోన్ నెంబర్ వాడేశారట!
X

మహేష్ బాబు, భూమిక హీరోహీరోయిన్లుగా వచ్చిన ఒక్కడు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎంఎస్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. మహేష్ బాబుకి బిగ్గెస్ట్ హిట్ ని ఇచ్చింది ఈ సినిమా.. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అయితే ఈ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మహేష్ బాబు ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు బాగా పేలాయి. భూమిక పాస్ పోర్ట్ కోసం మహేష్ బాబు అతడిని పెట్టే టార్చర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అప్పుడే కొత్త ఫోన్ కొనుకున్నా ధర్మవరపు.. తన ప్రియురాలు నుంచి కాల్ రావాలని అనుకుంటాడు.

కానీ ఆ టైంలో మహేష్ బాబు ఫ్రెండ్స్ ధర్మవరపుకి ఫోన్ చేసి ఏదోదో మాట్లాడుతూ ఏడిపించడం అల్టిమేట్ కామెడీ.. ఇప్పటికి టీవీలో వస్తే ఈ కామెడీని చూసి తెగ నవ్వుకుంటారు ఆడియన్స్.

అయితే ఈ కామెడీ సీన్ లో ధర్మవరపు తన ప్రియురాలుకి 9848032919 అనే నెంబర్ చెప్తాడు. ముందుగా ఈ సీన్ ని చిత్రకరించే సమయంలో ఎవరి నెంబర్ వాడుదాం అని ఆలోచిస్తుండగా, ఎవరిదో ఎందుకో నిర్మాత ఎంఎస్ రాజు ఫోన్ నెంబర్ పెట్టేదామని పెట్టేశారట.

అయితే సినిమా రిలీజ్ తరవాత కామెడీ సీన్ బాగా క్లిక్ కావడంతో ఆ నెంబర్ కి లక్షల్లో ఫోన్ కాల్స్ రావడంతో దెబ్బకు నిర్మాత రాజు నెంబర్ చేంజ్ చేసారట.

Next Story

RELATED STORIES