దూరదర్శన్‌‌లో సీరియల్‌‌గా రిజెక్ట్ చేస్తే.. అదే కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన పూరీ..!

సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌‌గా మాంచి పేరుంది దర్శకుడు పూరీ జగన్నాధ్‌‌కి. అతి తక్కువ టైంలో స్టార్ డైరెక్టర్‌‌గా ఎదిగాడు పూరీ.

దూరదర్శన్‌‌లో సీరియల్‌‌గా రిజెక్ట్ చేస్తే.. అదే కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన పూరీ..!
X

సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌‌గా మాంచి పేరుంది దర్శకుడు పూరీ జగన్నాధ్‌‌కి. అతి తక్కువ టైంలో స్టార్ డైరెక్టర్‌‌గా ఎదిగాడు పూరీ. అయితే పూరీ లైఫ్‌‌ని మార్చిన సినిమా మాత్రం "ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం" అనే చెప్పాలి. ముందుగా పవన్ అపాయింట్మెంట్ కోసం వినిపించిన కథ కూడా ఇదే.. కానీ పవన్ దగ్గరకి వెళ్ళాక చెప్పింది మాత్రం బద్రి సినిమా కథ. సీనియర్ దర్శకులు కే. బాలచందర్ తీసిన మరోచరిత్ర సినిమా పూరికి అల్ టైం ఫేవరేట్ మూవీ. చనిపోదామని కొండమీదికి వచ్చిన ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అనే లైన్ తో పూరీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథను రాసుకున్నాడు.

దర్శకుడు కాకముందే పూరీ ఈ స్టొరీని రాసుకున్నారు. ఈ కథకి కొండచరియ అనే టైటిల్ పెట్టి దూరదర్శన్‌‌లో సీరియల్‌ కోసం పంపిస్తే రిజెక్ట్ చేశారు. దీనితో ఈ కథని పక్కన పెట్టి బద్రి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు పూరీ. ఆ సినిమా సక్సెస్ తర్వాత బాచి అనే సినిమా తీసి పెద్ద ప్లాప్ అందుకున్నాడు. ఈ సినిమా పోవడంతో మళ్ళీ కథలపైన కూర్చున్న పూరీకి కొండచరియ కథ గుర్తుకువచ్చింది. అదే కథలో కొన్ని మార్పులు చేసి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంగా సినిమాకి కథ రెడీ చేశాడు. ముందుగా హీరో సుమంత్‌‌కి కథ చెబితే రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత తరుణ్ కూడా నో అనేశాడు. దీనితో చివరికి ఆ కథ రవితేజ వద్దకి వెళ్ళింది.

రవితేజ హీరోగా అనేసరికి సినిమాని నిర్మించడానికి నిర్మాతలు ఎవరు కూడా ముందుకు రాలేదు. చివరికి రవితేజ స్నేహితులైన వేణుగోపాల్ రెడ్డి, శేషురెడ్డి ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌‌గా ముందుగా ప్రత్యూషని అనుకున్నారు. ఆమె కూడా ఒప్పుకుంది. కానీ అప్పటికి మరో తమిళ్ సినిమా ఆఫర్ రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. అప్పటికే సినిమాల్లో అవకశాలు తిరిగి తిరిగి ఇక ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామని అనుకున్న తనూరాయ్‌‌కి ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఆమె ఏడ్చేసింది కూడా.

ఇక ఓ రోజు ఫ్లైట్ లో వెళ్తున్న పూరీకి ఎయిర్ హోస్టెస్ నచ్చడంతో సినిమాల్లో నటిస్తారా అనే అడిగారు ఆమె సమ్రీన్. చక్రి సంగీతం అందించాడు. దాదాపుగా 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పూరీ మళ్ళీ కంబ్యాక్ అనిపించుకోగా, రవితేజకి హీరోగా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా ఘనవిజయం సాధించాక దర్శకుడితో పాటుగా నిర్మాతగా కూడా మారాడు పూరీ.

Next Story

RELATED STORIES