SP Balasubrahmanyam : ఆ సినిమాకి పాటలా.. నా వల్ల కాదు బాబోయ్.. పారిపోయిన బాలు..!

SP Balasubrahmanyam : ఆ సినిమాకి పాటలా.. నా వల్ల కాదు బాబోయ్.. పారిపోయిన బాలు..!
SP Balasubrahmanyam : శంక‌రాభ‌ర‌ణం.. ఈ సినిమా గురించి మాట్లాడకుండా మనం తెలుగు సినిమా గురించి మాట్లాడలేము..

SP Balasubrahmanyam : శంక‌రాభ‌ర‌ణం.. ఈ సినిమా గురించి మాట్లాడకుండా మనం తెలుగు సినిమా గురించి మాట్లాడలేము.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచమంతా చాటిచెప్పిన అద్భుతమైన కళాఖండం ఇది.. అప్పటివరకు కమర్షియల్ హంగుల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి ఈ చిత్రం మేలిమలుపు అయ్యింది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై, ఏడిద నాగేశ్వర రావు నిర్మించారు.

సినిమాకి మొదట్లో అంతగా ఆదరణ లభించలేదు కానీ.. ఆ తర్వాత ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు తండోపతండాలుగా తరలివచ్చారు. ధియేటర్ లో ఆడుతున్న ఓ సినిమాని దైవంగా భావించి చెప్పులు బయటే విడిచి మరి సినిమాని చూశారు ప్రేక్షకులు. ఈ సినిమాకి సంగీతం ప్రాణమే అని చెప్పాలి. కె.వి.మహదేవన్ అందించిన ఒక్కో పాట అద్భుతమనే చెప్పాలి. శంకరా నాద శరీరాపరా, ఓంకార నాదాను, దొరుకునా ఇటువంటి సేవ, రాగం తానం పల్లవి, సామజ వరగమన వంటి పాటలన్నీ అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

శాస్త్రీయ సంగీతంతో తెరకెక్కిన ఈ సినిమాకి పాటలు పాడడమా.. బాబోయ్ నా వల్ల కాదు.. ,మరో గాయకుడిని చూసుకోండి అంటూ ముందుగా పారిపోయారట గానగంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం. ఈ విషయాన్ని విశ్వనాధ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా పాట‌లుగా చ‌రిత్రలో నిలబడిపోయే పాటలు.. ఈ విషయం బాలుకు కూడా తెలుసు. కానీ వాటికి తాను న్యాయం చేయ‌గ‌ల‌నా.. అనే సందేహం ఆయనలో బలంగా ఉండిపోయింది. అలాంటి భయాన్ని పోగొట్టింది పుగ‌ళేంది.

మహదేవన్ సంగీత సారధ్యంలో వేటూరి రాసిన ఈ పాటలను దగ్గరుండి మరి బాలుతో పాడించారు పుగ‌ళేంది.. దీనికి ముందు ఆరేసుకోబోయి పారేసుకున్నాను వంటి పాటలు పాడివ‌చ్చిన బాలు నోరు పుక్కిళించుకొని... రెండు తుల‌సి ఆకులు నమిలి దొర‌కునా ఇటువంటి సేవ‌ అంటూ పాడ‌టం మొద‌లుపెట్టారు. సినిమాకి ఆ పాటలే ప్రాణం పోశాయి.

Tags

Read MoreRead Less
Next Story