హారికలాంటి అమ్మాయి కావాలి..

బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి 70 రోజులు గడిచి పోయింది.

హారికలాంటి అమ్మాయి కావాలి..
X

కూతురంటే అలా ఉండాలి.. అమ్మ.. నాన్ననుంచి విడిపోయినా స్వతంత్రంగా ఎదుగుతూ పిల్లల్ని పోషించింది హారిక తల్లి. పిల్లలు కూడా అమ్మ చెప్పిన మాట వింటూ వాళ్ల కెరీర్లో ఎదిగారు. అమ్మని ప్రేమగా చూసుకుంటున్నారు అని దేత్తడి హారికపై ప్రశంసల వర్షం కురిపించింది అఖిల్ తల్లి.

బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి 70 రోజులు గడిచి పోయింది. ఇన్ని రోజులు అయిన వాళ్లకు, అమ్మానాన్నలకు దూరంగా ఉంటూ హౌస్‌లో గేమ్స్ ఆడుతూ, గొడవలు పడుతూ నానా రభస చేస్తూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు ఇంటి సభ్యులు. అందుకే షో మరి కొన్ని వారాల్లో ముగుస్తుందని కుటుంబసభ్యుల్ని హౌస్‌లోకి తీసుకువచ్చారు బిగ్‌బాస్.

కానీ కోవిడ్ కారణంగా ఎవర్నీ ఎవరితో కలవనివ్వలేదు.. గాజు తెరమాటున కుటుంబసభ్యులు ప్రేమని కురిపించారు.. వారి ప్రేమ, ఆప్యాయతలకు ఇంటి సభ్యులు పరవశించిపోయారు. ఈ రోజు హౌస్‌లోకి అఖిల్, అభిజిత్, అవినాష్, హారిక, అరియానా మదర్స్ వచ్చారు. వాళ్లని చూసిన ఇంటి సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

వారిని ఓదార్చే అవకాశం లేకపోయినా అద్దంలో నుంచే తమ పిలల్లను ఊరడించారు. కాగా, మా మధ్య ఎన్ని గొడవలు జరిగినా గేమ్ వరకే అని అంటే అభిజిత్ తల్లి మాత్రం కొట్టుకుంటేనే మజా వస్తుంది అని ఎంకరేజ్ చేసింది. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ అమ్మల ప్రేమతో నిండిపోతుంది.

Next Story

RELATED STORIES