సమంత హోస్టింగ్.. ఎంత సక్కగ చేసింది: ప్రేక్షకుల కాంప్లిమెంట్

ఇంటి సభ్యుల కన్నీళ్లను చూసి తానూ కరిగిపోయింది.

సమంత హోస్టింగ్.. ఎంత సక్కగ చేసింది: ప్రేక్షకుల కాంప్లిమెంట్
X

నవ్వుతూ, నవ్విస్తూ, పంచ్‌లు వేస్తూ, ఆధ్యంతం ఆహ్లాదభరితంగా హోస్ట్ చేసిన సమంత బుల్లి తెర ప్రేక్షకుల మనసు దోచేసింది. వేదికమీదకు వస్తూనే ఎంతో వినయంగా మామ నాగార్జున గారు నాభుజాల మీద పెద్ద బాధ్యత పెట్టారు. నాకు తెలుగు సరిగా రాదు. అయినా అర్థం చేసుకుని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంటూ ముద్దుగా వివరించింది. కానీ షో చివరి వరకు ఎక్కడా తడబడకుండా అంతా తెలుగులోనే సంభాషించడం విశేషం. తెలుగు బాగా వచ్చిన తెలుగు వారు కూడా స్టయిల్ కోసం ఇంగ్లీషులో మాట్లాడడం చూస్తూనే ఉన్నాము.

ఆదివారము.. ఆరోజే పండగ కూడా కావడం కలిసొచ్చిన అంశాలు. దాదాపు 3 గంటలు పైగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది బిగాబాస్ షో. ఇంటి సభ్యులపై పంచ్‌లు వేస్తూ ఒక ఆట ఆడుకుంది సమంత. వారి కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురైన ఇంటి సభ్యుల కన్నీళ్లను చూసి తానూ కరిగిపోయింది. ఎలిమినేషన్ ప్రక్రియను కూడా సమర్థవంతంగా నిర్వర్తించి మామకు భరోసా ఇచ్చింది. నేనున్నాను కదా.. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పకనే చెప్పినట్లనిపించింది. ఆహార్యం, అణుకువలో అక్కినేని వారింటి కోడలైన తరువాత మరింత బాధ్యతగా మెలుగుతున్న సమంత, మంచి పాత్రలతో ప్రేక్షకులను మైమరపిస్తోంది. సెలెక్టెడ్ మూవీస్ చేస్తున్న శామ్ సినిమాల కోసం ఆమె అభిమానులు నిరీక్షిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

Next Story

RELATED STORIES