బిగ్‌బాస్.. మాట తప్పానంటూ హారిక కన్నీళ్లు

ఆమె అన్న దాంట్లో పాయింట్ ఉన్నా అరుపుల్లో అసలు విషయం పక్కకి వెళిపోతోంది.

బిగ్‌బాస్.. మాట తప్పానంటూ హారిక కన్నీళ్లు
X

బిగ్‌బాస్ హౌస్‌లో అరుపులు, అలకలు, కన్నీళ్లు కామన్. హౌస్‌లో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లు నచ్చకపోయినా ఆడక తప్పదు. అపోజిట్ టీం‌లో జిగిరీ దోస్త్ ఉన్నా ఆట ఆటే. గెలిచి తీరడమే లక్ష్యం. ఎమోషన్స్‌ని ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కెమెరా ముందు బుక్కయిపోతుంటారు. కోపిష్టిగా ముద్ర పడ్డ సొహెల్ కెప్టెన్ అయిన తరువాత చాలా కంట్రోల్‌గా ఉంటూ తన బాధ్యతను నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. అరియానా ఆ పాత్ర తీసుకున్నట్లు అరిచేస్తోంది. ఆమె అన్న దాంట్లో పాయింట్ ఉన్నా అరుపుల్లో అసలు విషయం పక్కకి వెళిపోతోంది.

ఇక అసలు విషయానికి వస్తే హారికకు బిగ్ బాస్ ఆమెకు కన్నీళ్లు తెప్పించాడు.. హౌస్ మేట్స్‌ని రెండు టీమ్‌లుగా విడగొట్టిన బిగ్ బాస్.. ఒక టీమ్ లోని సభ్యులను జుట్టు కత్తిరించుకోమన్నారు.. ఆ టీంలో ఉన్న లాస్య, దివి అందుకు ఒప్పుకోలేదు.. అదే టీంలో ఉన్న హారిక అందుకు ఒప్పుకుని కత్తిరించుకుంది. షోకు వచ్చేముందు మా అన్నయ్య స్ట్రిక్ట్‌గా చెప్పాడు జుట్టు కత్తిరించుకోవద్దని అంటూ కెమెరా ముందు కంటతడి పెట్టింది. సారీ అన్నయ్యా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అంటూ ఏడ్చేసింది. మిగిలిన ఇంటి సభ్యులు ఆమెను ఓదార్చడమే కాదు. నువ్వు సూపర్ అంటూ ఎత్తేశారు.

Next Story

RELATED STORIES