7 Arts Sarayu : ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది కమిట్మెంట్ అడిగారు.. అందుకే ఇంకా ఉన్నాను...!

7 Arts Sarayu : ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది  కమిట్మెంట్ అడిగారు.. అందుకే ఇంకా ఉన్నాను...!
Bigg Boss Sarayu Roy : 7 ఆర్ట్స్ సరయి.. బిగ్‏బాస్‏ను దమ్‌‌దమ్ చేస్తానంటూ అనూహ్యంగా హౌజ్ నుంచి మొదటివారమే బయటకు వచ్చింది.

Bigg Boss Sarayu Roy : 7 ఆర్ట్స్ సరయి.. బిగ్‏బాస్‏ను దమ్‌‌దమ్ చేస్తానంటూ అనూహ్యంగా హౌజ్ నుంచి మొదటివారమే బయటకు వచ్చింది. ఎన్నో అంచనాలతో హౌజ్ లోకి వెళ్ళిన సరయు.. ఇలా ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అవ్వడంతో ఆమెతో పాటుగా ఆమె అభిమానులు కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిచింది ఈ బ్యూటీ. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమని, తెలుగు ఇండస్ట్రీ అంటే గౌవరమని చెప్పుకొచ్చింది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది కమిట్‌‌మెంట్ అడిగారని వెల్లడించింది.

అలాంటి సమయంలో చాలా ఏడ్చేదానిని అని తెలిపింది. వాళ్ళకి నా ఫేస్ అలా కనిపిస్తుందా అని బాధపడేదానిని అని తెలిపింది. కానీ 7ఆర్ట్స్ ఛానల్ తర్వాత ఎవరికీ భయపడలేదని, ఎవ్వరు కూడా అడగలేదని వెల్లడించింది. కానీ ఎన్ని అవమానులు ఎదురైనా ఇండస్ట్రీ అంటే గౌరవమని, తెలుగు సినిమాలు చూసి పెరిగానని, అందుకే ఇంకా ఇండస్ట్రీలో ఉంటున్నానని వెల్లడించింది. అన్నపూర్ణ స్టూడియోలో ఒక్కసారి అడుగుపెడితే చాలు అనుకున్న నాకు ఇలాంటి మంచి స్థానం దక్కడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానని ఎప్పుడు కూడా అనుకోనని వెల్లడించింది.

ఇక వ్యక్తిగత విషయాల పైన మాట్లాడుతూ.. తానూ ఓ వ్యక్తితో ఏడేళ్ళు రిలేషన్‌లో ఉన్నానని, అతడే సర్వం అనుకున్నానని.. పెళ్లి చేసుకుందామని అనుకున్నామని చెప్పుకొచ్చింది. అయితే.. కట్నం దగ్గర గొడవ రావడంతో పీటల వరకు వచ్చిన పెళ్లి క్యాన్సల్ అయిందని తెలిపింది. అబ్బాయి తల్లిదండ్రులు ముందుగా 25 లక్షల కట్నం మొదలుపెట్టి కోటి రూపాయల వరకు వెళ్లారని, చివరికి ఆస్తిలో సగభాగం కూడా అడిగేశారని తెలిపింది.

పెళ్ళికి ముందే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకొనే ఆ పెళ్లి వద్దనుకున్నానని చెప్పింది. లైఫ్ లో ఇలాంటివి ఎన్ని దెబ్బలు వచ్చిన ఎదిగి చూపిస్తానని.. ఆ విషయంలో తగ్గేది లేదు అంటూ తెలిపింది. ఇక తాను వర్జిన్ కాదంటూ బోల్డ్ గానే ఆన్సర్ ఇచ్చింది. ఇక తన మెంటాలిటీకి తగ్గట్టుగా ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

Tags

Read MoreRead Less
Next Story