Bigg Boss 5 Telugu Hamida : అతని కళ్ళు నచ్చాయట.. ఎవరీ హమీదా?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 చాలా గ్రాండ్ గా మొదలైంది. ముచ్చటగా మూడో సారి కింగ్ నాగార్జునే షోని హోస్ట్ చేస్తున్నారు. 'చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్‌బై' అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగ్.. మిస్టర్ మజ్ను పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. అనంతరం ఒక్కో కంటెస్టెంట్ ని హౌస్ లోకి ఆహ్వానించాడు. అందులో భాగంగానే పదకొండవ కంటెస్టెంట్‌గా అదిరిపోయే డాన్స్‌తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హమీదా.. . ఈమె సాహసం సేయరా డింభకా సినిమాలో నటించింది. అందంగా ఉన్నప్పటికీ ఆఫర్స్ అయితే రాలేదు. అయితే అబ్బాయిల్లో తనకు హైట్, కళ్లు, చిరునవ్వు, హెయిర్ స్టైలింగ్ అంటే ఇష్టమని చెప్పగా, ఆమెకి బిగ్ బాస్ స్క్రీన్‌పై ఇతర మేల్ కంటెస్టెంట్ల కళ్లు మాత్రమే చూపించాడు. అందులో ఒకరి కళ్లు తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చింది హమీదా. ఇంతకీ ఆ కళ్లు ఎవరివి? అన్నది తెలియాలంటే చూడాల్సిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com