Bigg Boss 5 Telugu: లోబోతో కలిసి దమ్ముకొడుతున్న భామలు..!

అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తాజాగా మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం 10 మంది అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Bigg Boss 5 Telugu: లోబోతో కలిసి దమ్ముకొడుతున్న భామలు..!
X

అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తాజాగా మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం 10 మంది అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌజ్ లోని మెల్ కంటెస్టెంట్ల పైన లహరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లైనవాళ్లు, చిన్నపిల్లే ఉన్నారని.. తనకెవరూ కనెక్ట్‌ అయ్యేలా లేరని అంటూ కామెంట్స్ చేసింది. మరోవైపు ప్రియాంక సింగ్‌ అందరినీ బ్రో అని పిలిచింది కానీ మానస్‌ను మాత్రం అలా పిలవలేనని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా హమీదా, సరయూ స్మోకింగ్ రూమ్ లో స్మోక్ చేస్తూ కనిపించారు. మెల్ కంటెస్టెంట్ లోబోతో కలిసి ఈ ఇద్దరు భామలు దమ్ము కొట్టారు. గుప్పుమని పొగలు వదులుతూ ఇంటి సభ్యుల గురించి మాట్లాడుకున్నారు. ఇంటి సభ్యులలో కొందరు కనెక్ట్ అవ్వడం కష్టమని, బయటే కనెక్ట్‌ అవుతామంటూ మాట్లాడుకున్నారు. ఇక సిగరెట్లు ప్రతిరోజు వస్తాయో లేదో అని హమీదా అనుమానం వ్యక్తం చేయగా ప్రతిరోజు వస్తాయని సమాధానం ఇచ్చాడు లోబో. అన్‌సీన్‌ ఎపిసోడ్‌లో ప్రసారం చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Next Story

RELATED STORIES