బిగ్‌బాస్ విన్నర్ అభిజీత్ హీరోగా ఓ చిత్రం..

తన దగ్గరకు వచ్చే కథల గురించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నాడు.

బిగ్‌బాస్ విన్నర్ అభిజీత్ హీరోగా ఓ చిత్రం..
X

బిగ్ బాస్ అభిజీత్: యంగ్ హీరో అభిజీత్‌కు బిగ్ బాస్ సీజన్ 4 తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ తర్వాత పోటీదారులందరూ ఎటువంటి అవకాశాలను వదలకుండా సినిమాలు తీస్తున్నారు. కానీ అభిజీత్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.. తన దగ్గరకు వచ్చే కథల గురించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నాడు.

అభిజిత్ కోసం ఇప్పటికే చాలా మంది కొత్త దర్శకులు క్యూ కట్టారు.. ఈ బిగ్ బాస్ విజేత చివరకు ఓ కథకు ఓకే చెప్పాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. అభిజీత్ మంచి కథతో సినిమా చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాడు. ఓ డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తోకథ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES