అఖిల్‌కి 25.. మోనాల్‌కి 30.. వాళ్లిద్దరికీ పెళ్లేంటి!!

అఖిల్ అసలు స్వరూపం బయటకు వచ్చింది

అఖిల్‌కి 25.. మోనాల్‌కి 30.. వాళ్లిద్దరికీ పెళ్లేంటి!!
X

ఇంట్లో ఉన్న వాళ్లతోనే అన్నీ షేర్ చేసుకోవాలి.. అందులో కొందరికి కొందరు నచ్చుతారు.. వాళ్లతో క్లోజ్‌గా ఉంటారు.. అందులో తప్పేం ఉంది.. దానికి కథలు అల్లేసి కళ్యాణం వరకు తీసుకెళతారు అంటూ బిగ్‌బాస్ హౌస్‌లో అఖిల్, మోనాల్‌పై వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అఖిల్ తల్లి. అయినా మావాడి వయసు 25, ఆ అమ్మాయి వయసు 30 ఎలా పెళ్లి చేస్తాం అంటున్నారు. తండ్రి కూడా ససేమిరా గుజరాత్ పిల్ల మోనల్ గజ్జర్‌ని కోడలుగా చేసుకునే సమస్యేలేదంటూ కుండ బద్దలు కొడుతున్నారు.

ఇదిలా ఉంటే నీకంటే నేనే బాగా ఆడుతున్నా అంటూ మోనాల్‌ని నామినేట్ చేస్తుండే సరికి అఖిల్ అసలు స్వరూపం బయటకు వచ్చింది అని మోనాల్ కన్నీరు పెడుతోంది.. ఇక ఇదే అవకాశంగా తీసుకుని అమ్మ రాజశేఖర్ నీకు నేను సపోర్ట్ చేస్తా అంటూ మోనాల్‌కి భరోసా ఇస్తున్నారు. హౌస్‌లోని సభ్యులకు పిచ్చి పిచ్చి టాస్కులు ఇచ్చి పిచ్చెక్కిస్తున్నాడు బిగ్‌బాస్. బురద నెత్తి మీద పోయడం, విసురుగా నీళ్లు కొట్టడం, ఐస్ ముక్కలు తల మీద గుమ్మరించడం.. ఊపిరిబిగబట్టి భరిస్తున్నట్లుగా ఉంది ఇంటి సభ్యులు.

Next Story

RELATED STORIES