Bigg Boss Sarayu Roy : పవన్‌‌కళ్యాణ్ కి పడిపోయా.. పవర్‌‌స్టార్ లో అదంటే పిచ్చి..!

Bigg Boss Sarayu Roy : పవన్‌‌కళ్యాణ్ కి పడిపోయా.. పవర్‌‌స్టార్ లో అదంటే పిచ్చి..!
Bigg Boss Sarayu Roy : 7 ఆర్ట్స్ సరయి.. బిగ్‏బాస్‏ను దమ్‌‌దమ్ చేస్తానంటూ అనూహ్యంగా హౌజ్ నుంచి మొదటివారమే బయటకు వచ్చింది.

Bigg Boss Sarayu Roy : 7 ఆర్ట్స్ సరయి.. బిగ్‏బాస్‏ను దమ్‌‌దమ్ చేస్తానంటూ అనూహ్యంగా హౌజ్ నుంచి మొదటివారమే బయటకు వచ్చింది. ఎన్నో అంచనాలతో హౌజ్ లోకి వెళ్ళిన సరయు.. ఇలా ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అవ్వడం.. ఆమెతో పాటుగా ఆమె అభిమానులు కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపేస్తుంది ఈ బ్యూటీ.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్‌‌స్టార్ పవన్‌‌కళ్యాణ్ పైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. తానూ చిన్నప్పటి నుంచి చిరంజీవి, పవన్‌‌కళ్యాణ్‌‌కి పెద్ద అభిమానని, వారి సినిమాలు చూస్తూ పెరిగానంటూ చెప్పుకొచ్చింది. ఇక పవన్‌‌కళ్యాణ్ మ్యానరిజం చూసి పవన్‌‌తో లవ్‌‌లో పడిపోయానని తెలిపింది. పవన్ అంటే క్రేజ్ అని చెప్పుకొచ్చింది. ఆయనతో ఒక్క సినిమా చేయాలనీ ఉందని వెల్లడించింది ఈ బోల్డ్ బ్యూటీ.

ఇక వ్యక్తిగత విషయాల పైన మాట్లాడుతూ.. తానూ ఓ వ్యక్తితో ఏడేళ్ళు రిలేషన్‌లో ఉన్నానని, అతడే సర్వం అనుకున్నానని.. పెళ్లి చేసుకుందామని అనుకున్నామని చెప్పుకొచ్చింది. అయితే.. కట్నం దగ్గర గొడవ రావడంతో పీటల వరకు వచ్చిన పెళ్లి క్యాన్సల్ అయిందని తెలిపింది. అబ్బాయి తల్లిదండ్రులు ముందుగా 25 లక్షల కట్నం మొదలుపెట్టి కోటి రూపాయల వరకు వెళ్లారని, చివరికి ఆస్తిలో సగభాగం కూడా అడిగేశారని తెలిపింది.

పెళ్ళికి ముందే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకొనే ఆ పెళ్లి వద్దనుకున్నానని చెప్పింది. లైఫ్ లో ఇలాంటివి ఎన్ని దెబ్బలు వచ్చిన ఎదిగి చూపిస్తానని.. ఆ విషయంలో తగ్గేది లేదు అంటూ తెలిపింది. ఇక తాను వర్జిన్ కాదంటూ బోల్డ్ గానే ఆన్సర్ ఇచ్చింది. ఇక తన మెంటాలిటీకి తగ్గట్టుగా ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

Tags

Read MoreRead Less
Next Story