నేను తాగుతా.. బలుపు కూడా ఎక్కువ : బిగ్‌‌బాస్ లహరి

బిగ్‌‌బాస్ హౌజ్‌‌లో ఉన్న కంటెస్టెంట్లలో లహరి కాస్త డిఫిరెంట్.. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆమె స్టైల్..

నేను తాగుతా.. బలుపు కూడా ఎక్కువ : బిగ్‌‌బాస్ లహరి
X

బిగ్‌‌బాస్ హౌజ్‌‌లో ఉన్న కంటెస్టెంట్లలో లహరి కాస్త డిఫిరెంట్.. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆమె స్టైల్.. బిగ్‌‌బాస్ షోకి రాకముందు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అలాగే ఓపెన్ గా మాట్లాడుతూ తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. ఈ అర్జున్‌‌రెడ్డి భామ. తన పేరెంట్స్ తనకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారని, అయితే ఈ ఫ్రీడమ్‌‌ని ఎప్పుడు కూడా దుర్వినియోగపరచుకోలేదని చెప్పుకొచ్చింది. అది బట్టల విషయంలో కూడా అంటుంది.. ఏదైనా డ్రెస్ వేసుకుంటే నువ్వ ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావ్ అనే మాట మా ఇంట్లో వినిపించదని, ఏ విషయాల్లో పేరెంట్స్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పరని చెప్పుకొచ్చింది. ఇక తనకి తన మీద బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువని, గట్టిగా చెప్పాలంటే బలుపు బాగా ఎక్కువని వెల్లడించింది. ఇక తనకి వైన్ తాగే అలవాటు ఉందని, బట్ తాగుబోతుని కాదని... పార్టీలలో మాత్రమే తాగుతానని చెప్పుకొచ్చింది లహరి. ఆమెకి సంబంధించిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

Next Story

RELATED STORIES