అక్కడ నటించే వారే ఎక్కువ.. లవ్ ట్రాక్‌ని డిస్ట్రబ్ చేయడానికి ఇష్టం లేకే నన్ను నామినేట్ : కుమార్ సాయి

బిగ్‌బాస్ ఎలాంటి ఆటలు ఆడారో నాకు తెలియదు.

అక్కడ నటించే వారే ఎక్కువ.. లవ్ ట్రాక్‌ని డిస్ట్రబ్ చేయడానికి ఇష్టం లేకే నన్ను నామినేట్ : కుమార్ సాయి
X

బిగ్‌బాస్ హౌస్ అంటే అంతే మరి.. ఎవరు హౌస్‌లో ఉంటారు ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేం అంటూ నవ్వుతూ బయటకు వచ్చిన కుమార్ సాయి.. బయట పరిస్థితి అందుకు విరుద్దంగా ఉందని తెలుసుకున్నారు. నువు జెన్యూన్ ఆడావని నీకు మేం ఓట్లేస్తే నువ్వెలా నామినేట్ అయ్యావని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దాంతో కుమార్ సాయికి తనపై తనకే డౌట్ వచ్చింది. ఏదేమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్లి ఒక పాజిటివ్ వైబ్‌‌తో బయటకు వచ్చాడు కుమార్. హౌస్ విషయాలు ముచ్చటిస్తూ..

హౌస్‌లో ఎవరికి వారు ఒక కంఫర్ట్ జోన్‌ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆట విషయానికి వచ్చే ఎవరి ఆట వారే సింగిల్‌గా ఆడుతున్నారు. పైకి మాత్రం నటిస్తున్నారు. ఇక హౌస్‌లో అతి కష్టమైన పని ఏంటంటే నామినేట్ చేయడం.. అప్పటి వరకు స్నేహంగా ఉన్న వ్యక్తిని నామినేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడే మన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. నేను హౌస్‌లోకి లేట్‌గా వెళ్లినా చాలా హుషారుగా వెళ్లాను. కానీ అక్కడ పరిస్థితి చూసి కాస్త డల్ అయ్యాను. నాతో మాట్లాడడానికి ఎవరూ ఇష్టపడేవారు కాదు.

డాన్స్ చేయాలి, యాక్ట్ చేయాలి అంటే టాస్క్ వరకు చేయొచ్చు. కానీ 24 గంటలూ నటిస్తూనే ఉండాలంటే నావల్ల కాలేదు. నవ్వించాలి అనేవారు అది నాకు నచ్చలేదు.. నేను కమెడియన్ అని లోపలికి వెళ్లి జోక్స్ వేస్తే నాకంటూ వ్యక్తిత్వం ఉండదు నా వ్యక్తిత్వానికి ప్రశంసలు రావాలి కానీ.. నా పెర్మామెన్స్‌కి రావాలని బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టలేదు. బిగ్‌బాస్‌లో నడుస్తున్న లవ్ ట్రాక్‌ని డిస్ట్రబ్ చేయడానికి ఇష్టం లేకే నన్ను నామినేట్ చేశారా అన్నది తెలియదు..

తెరవెనుక ఏం జరిగింది అన్నది నాకు తెలియదు.. బిగ్ బాస్ ఏం చెప్తే అది చేశా.. నువ్వు నీలా ఉంటు అని చెప్పారు. చెప్పినట్లు చేశా.. కానీ బిగ్‌బాస్ ఎలాంటి ఆటలు ఆడారో నాకు తెలియదు. ఎలిమినేట్ అయినా స్టేజ్ మీద నాగార్జున గారు నా కథ వింటానంటూ మాట ఇచ్చారు. అప్పుడు నేను గెలిచినంత ఆనందం పొందాను. త్వరలోనే నేను రాసిన కథ ఆయనకు వినిపిస్తా అని చెప్పుకొచ్చారు కుమార్ సాయి.

Next Story

RELATED STORIES