HBD Rajashekar : యాంగ్రీయంగ్ మేన్ కి బర్త్ డే విషెస్!

HBD Rajashekar : యాంగ్రీయంగ్ మేన్ కి బర్త్ డే విషెస్!
ఒకప్పుడు అతని ఆవేశం చూసి వెండితెర కూడా ఊగిపోయింది. అతను చేసిన అంకుశం ఎంతో మంది హీరోలకు నిద్రలేకుండా... తర్వాత వాళ్లూ అలాంటి పాత్రలే చేయాలనే కలలు కనేలా చేసింది.

ఒకప్పుడు అతని ఆవేశం చూసి వెండితెర కూడా ఊగిపోయింది. అతను చేసిన అంకుశం ఎంతో మంది హీరోలకు నిద్రలేకుండా... తర్వాత వాళ్లూ అలాంటి పాత్రలే చేయాలనే కలలు కనేలా చేసింది. ఆవేశానికి మారుపేరుగా నిలిచినా.. సెంటిమెంట్ ను పండించడంలో రాజశేఖర్ మాత్రమే సహజంగా ఏడుస్తాడు అనే పేరూ తెచ్చుకున్నాడు. సాఫ్ట్ పాత్రలతో మొదలై యాంగ్రీయంగ్ మేన్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు రాజశేఖర్. ఇవాళ ఈ యాంగ్రీయంగ్ మేన్ పుట్టిన రోజు..

రాజశేఖర్ పుట్టింది తమిళనాడులో. అతని తమ్ముడు సెల్వ కోలీవుడ్ లో నటుడు. అయితే రాజశేఖర్ మాత్రం బాగా చదువుకుని డాక్టర్ అయ్యాడు. తమిళనాడులో ప్రాక్టీస్ చేస్తున్న టైమ్ లోనే అతనికి సినిమాల్లో అవకాశం వచ్చింది. తమిళంలో పుతియ తీర్పు అనేది తొలి సినిమా. తెలుగులో వందేమాతరం. హానెస్ట్ గా కనిపించే రాజశేఖర్ నవ్వు మన ప్రేక్షకులకు బాగా నచ్చింది. వందేమాతరం విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు వచ్చాయి.

రాజశేఖర్ ను పెద్ద స్టార్ ల లీగ్ లో నిలిపింది.. అతన్నీ అప్పటి వరకూ కంటే బిగ్గెస్ట్ స్టార్ ను చేసింది 1989లో వచ్చిన అంకుశం. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఈ సినిమా సాధించిన విజయం తెలుగు సినిమా పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. యాంగ్రీ పోలీస్ ఇన్స్ పెక్టర్ గా రాజశేఖర్ పాత్రలో జీవించాడు. అంకుశం అద్భుత విజయం సాధించి రాజశేఖర్ ప్లేస్ ను తెలుగులో పర్మనెంట్ చేసింది. అంకుశం తర్వాతే తను ప్రేమించిన జీవితను పెళ్లి చేసుకున్నాడు..

రాజశేఖర్ లో ప్రతిభ ఉంది.. నటుడిగా ఓ ఇమేజ్ ఉంది. కానీ రావాల్సిన రేంజ్ కానీ, స్టార్డమ్ కానీ రాలేదు. అందుకు పూర్తిగా అతనే కారణం అంటుంది పరిశ్రమ. కొన్ని వివాదాలు, టైమింగ్ సరిగా లేకపోవడమే రాజశేఖర్ కు పెద్ద రేంజ్ రాకపోవడానికి కారణంగా చెప్పేవారు చాలామందే ఉంటారు. ఈ విషయంలో అతన్ని బాహాటంగానే విమర్శించిన దర్శక నిర్మాతలు కూడా కనిపిస్తారు. అందుకే ఆయనకు అల్లరి ప్రియుడు లాంటి మూవీ తర్వాత కూడా రేంజ్ పెరగలేదంటారు.

సింహరాశి తర్వాత మళ్లీ రాజశేఖర్ కు విజయాలు మొహం చాటేశాయి. ఓ రకంగా అతని కెరీర్ అంతా ఇలాగే అప్ అండ్ డౌన్స్ లోనే సాగిపోయింది. అయితే ఒకటి రెండు సార్లు పడిన తర్వాత కూడా అతను పెద్దగా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించదు. అందుకే రాజశేఖర్ విజయాల్లాగే ఇమేజ్ కూడా మెల్లగా తగ్గడం మొదలైంది. ఆ టైమ్ లో మళ్లీ ఎవడైతే నాకేంటీ అని మరోసారి గర్జించాడు.. అంటే ఆ వెంటనే మరికొన్ని ఫ్లాపులు రెడీగా ఉన్నయన్నమాట.

వరుస ఫ్లాపులతో బాగా కుంగిపోయాడు రాజశేఖర్. దీంతో కెరీర్ కు సంబంధించి సెకండ్ థాట్ తీసుకోవాలనుకుంటోన్న టైమ్ లో లక్కీగా తగిలాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. తను రాసుకున్న ఓ కథకు రాజశేఖర్ అయితేనే న్యాయం చేస్తాడు అని అతను నమ్మాడు. రాజశేఖర్ కు నమ్మకం లేకపోయినా అతన్నీ నమ్మించాడు. కట్ చేస్తే గరుడవేగ 2017లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. గరుడవేగ విజయంలో కథాబలం, దర్శకుడి తెలివి ఎంత ఉన్నాయో అంతకంటే ఎక్కువగా రాజశేఖర్ కష్టం కనిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story