హీరోయిన్‌ స్నానానికి ఏకంగా బిస్లరీ వాటర్‌..!

సినిమా షూటింగ్ సమయాల్లో హీరోయిన్లకి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలుంటాయి. స్టార్ హీరోయిన్ అయితే ఆ జాగ్రత్తలు ఇంకోచం ఎక్కువగానే ఉంటాయి.

హీరోయిన్‌ స్నానానికి ఏకంగా బిస్లరీ వాటర్‌..!
X

సినిమా షూటింగ్ సమయాల్లో హీరోయిన్లకి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలుంటాయి. స్టార్ హీరోయిన్ అయితే ఆ జాగ్రత్తలు ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయి. తినే ఫుడ్ నుంచి.. ఉండే హోటల్ వరకు అన్నీ చాలా రిచ్ గానే ఉంటాయి. ఇలాంటి సమయంలో నిర్మాతలకి కొంచం బడ్జెట్ ఎక్కువగా అవుతుంది. సీనియర్ నటి శ్రీవిద్య అందరికీ గుర్తుండే ఉంటుంది. తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కెరీర్ చివరి రోజుల్లో అయితే ఎక్కువగా మలయాళం చిత్రాలను చేశారు.

అయితే శ్రీవిద్య ఓ తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నప్పుడు అవుట్‌డోర్‌ షూటింగ్‌ కోసం రాజమండ్రి దగ్గరలోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆమె ఉండేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. కానీ స్నానం మాత్రం గోదావరి నీళ్లతో చేయాల్సి వచ్చింది. అయితే వరదల కారణంగా నీళ్లన్నీ బురదగా అయిపోయాయి. ఈ సమయంలో షూటింగ్ సిబ్బంది ఒక రకమైన కాయను అరగదీసి కలిపితే బురద కిందకు పోయి, స్వచ్ఛమైన నీరు పైకి తేలేది. ఆ స్వచ్ఛమైన నీరును స్నానానికి వాడేవారు.

నటి శ్రీవిద్య మాత్రం ఆ నీటితో స్నానం చేసేందుకు ఒప్పుకోలేదు. ఎంత తేటగా ఉన్నా ఆ వాటర్ లో ఇంకా బురుద ఉంటుందని... ఆ నీటితో స్నానం చేస్తే, తన శరీర సొగసు పాడవుతుందని ఆమె చిత్ర సిబ్బందితో వాదించారు. అయితే చివరికీ అందరికీ తాగడానికి వాడుతున్న బిస్లరీ వాటర్‌ ని తెప్పించి, బకెట్లలో పోసి ఇచ్చారు. అప్పుడే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన బిస్లరీ వాటర్‌ బాటిల్ ధర ఆరు రూపాయలు.. అలాంటి సీసాలు రెండు బకెట్లకి సరిపడా తెప్పించారు నిర్మాతలు. అప్పడు కానీ ఆమె ఆ నీటితో స్నానం చేసి షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అయ్యారు.

Next Story

RELATED STORIES