డ్రగ్స్ కేసు.. కోడ్‌ భాషలో హీరోయిన్లు ఛాటింగ్?

కోడ్‌ భాషలో D అంటే దీపిక అని, K అంటే కరిష్మా అని అనుమానిస్తోంది ఎన్‌సీబీ.

డ్రగ్స్ కేసు.. కోడ్‌ భాషలో హీరోయిన్లు ఛాటింగ్?
X

బాలీవుడ్ డ్రగ్స్ కేసు ప్రకంపలు సృష్టిస్తోంది. ఎన్సీబీ విచారణలో.... ఒక్కొక్కొరి పేర్లు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే పలువురు నటీనటుల పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చింది. కొన్ని జాతీయ ఛానెల్స్ డ్రగ్స్ కేసులో నమ్రత పేరును ప్రస్తావించాయి. టాలెంట్ మేనేజర్ జయ సాహా తో నమ్రత చాటింగ్ చేసినట్టు కథనాలు వస్తున్నాయి. బాంబేలో మంచి MD ఇస్తానని ప్రామిస్ చేశావ్.. MD ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందామని టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రత చాటింగ్ చేసినట్టు కథనాలు వస్తున్నాయి. దాంతో టాలీవుడ్ ఒక్క సారిగా షాక్ కు గురైంది.

మరో వైపు ఈ కేసులో దియా మిర్జా పేరు సైతం బయటపడింది. 2019లో దియా మిర్జా డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆమెతో పాటు ఆమె మేనేజర్‌ను ఎన్సీబీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, దీపికా మేనేజర్ కరిష్మా పేర్లు వినిపించాయి. జయ వాట్సాప్ చాట్ చేసిన దాన్ని బట్టి ఆమె దీపికా పర్సనల్ మేనేజర్ కరిష్మా డ్రగ్స్ గురించి చర్చించిందని ఎన్‌సీబీ అధికారుల దృష్టికి వచ్చింది. అందులో ఉన్న కోడ్‌ భాషలో D అంటే దీపిక అని, K అంటే కరిష్మా అని అనుమానిస్తోంది ఎన్‌సీబీ.

త్వరలోనే వీరందరికి సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ... రియాను ప్రశ్నించింది. ఆమె 25 మంది పేర్లు బయటపెట్టిందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా కొత్త పేర్లు బయటపడుతున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా నమ్రత పేరు తెర మీదకు రావడంతో.. టాలీవుడ్‌ షాక్‌కు గురైంది.

Next Story

RELATED STORIES