చావు కబురు చల్లగా.. ట్విట్టర్ రివ్యూ

మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చావు కబురు చల్లగా ట్విట్టర్ రివ్యూ సినిమా పట్ల పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేసింది.

చావు కబురు చల్లగా.. ట్విట్టర్ రివ్యూ
X

RX100 తో అందరి చూపులను తనవైపు తిప్పుకున్నాడు.. సాదా సీదాగా ఉంటూ సంచలనం సృష్టించాడు. మొదటి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన కార్తికేయ మరో విచిత్ర టైటిల్‌తో మనముందుకొచ్చాడు. సొట్టబుగ్గల లావణ్యం అతడికి జోడీగా నటించింది.

మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చావు కబురు చల్లగా ట్విట్టర్ రివ్యూ సినిమా పట్ల పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేసింది. పెగళ్లపాటి దర్శకుడిగా ఈ చిత్రంతో పరిచయం అయ్యారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. అందాల అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. భారీ ప్రమోషన్ల మధ్య ఈ సినిమా మంచి బిజినెస్‌ని సొంతం చేసుకుంది.

ఇక చిత్ర కథ విషయానికి వస్తే బస్తీ బాలరాజుగా కార్తీకేయ నటన ఆకట్టుకుందని అంటున్నారు ఆడియన్స్. నటనలో ఎంతో పరిణతి కనబరిచి మంచి మార్కులు కొట్టేశాడు అని కార్తికేయను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అలాగే డీగ్లామర్ పాత్రలో నటించిన లావణ్య తన సహజ నటనతో అద్భుతంగా నటించిందని ఆమె నటన సినిమాకే హైలెట్ అని అంటున్నారు. అలాగే ఎమోషన్ సీన్స్ ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చని రివ్యూలు తెలిపాయి.

Next Story

RELATED STORIES