హిట్లర్ సినిమాని వదులుకున్న స్టార్ హీరో..!

సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక హీరోతో అనుకోని కథ రాసుకుంటే ఆ కథను మరో హీరో చేయాల్సి వస్తుంది.

హిట్లర్ సినిమాని వదులుకున్న స్టార్ హీరో..!
X

సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక హీరోతో అనుకోని కథ రాసుకుంటే ఆ కథను మరో హీరో చేయాల్సి వస్తుంది. ఇండస్ట్రీలో ఇది సహజమే కూడా .. సరిగ్గా చిరంజీవి విషయంలో కూడా ఓ సారి ఇదే జరిగింది. అదే 1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన హిట్లర్ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి చేసిన సినిమాకి రీమేక్.. అక్కడ ఇది సూపర్ హిట్ మూవీ.. పైగా అన్నాచెల్లెల్ల సెంటిమెంట్... అప్పటికే ముత్యాల సుబ్బయ్యకి సెంటిమెంట్ సుబ్బయ్య అనే పేరు కూడా ఉంది.

దీనితో ఈ సినిమాకి ఒకే చెప్పేశారు చిరు. సినిమాకి ముందు అంచనాలు కూడా లేవు.. కానీ వేటూరి రాసిన నడక కలిసిన నవరాత్రి పాట సినిమా పైన ఒక్కసారిగా అంచనాలను భారీగా పెంచేసింది. ఈ పాటకి చిరు డాన్స్ కూడా అదిరిపోయింది. రచయిత ఎల్. బి. శ్రీరామ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు.. అంతొద్దు - ఇది చాలు అన్న డైలాగు ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. 42 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే ఈ సినిమాని ముందుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఈవివి సత్యనారాయణ చేయాలనీ అనుకున్నారట. కానీ అప్పటికే ఈవివి రెండు సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాని వదులుకున్నారు.

Next Story

RELATED STORIES