నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలి: చిరంజీవి ట్వీట్

ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలి: చిరంజీవి ట్వీట్
X

హీరో రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. భార్య జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మిక కోలుకున్నా రాజశేఖర్ ఆరోగ్యం కుదట పడలేదు. ఆయన ఇంకా ఆస్పత్రిలోనే చికిత్ప పొందుతున్నారు. ఇదే విషయమై ఆయన కూతురు శివాత్మిక ట్వీట్టర్ లో పోస్ట్ పెట్టింది. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించమంటూ అభిమానులను కోరింది. ఈ నేపథ్యంలో శివాత్మిక ట్వీట్ పై స్పందించిన మెగాస్టార్.. రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

'ప్రియమైన శివాత్మికా మీ ప్రియమైన నాన్న, నా సహ నటుడు, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన కోసం అలాగే మీ కుటుంబం కోసం ప్రార్థనలు చేస్తాం. ధైర్యంగా ఉండు' అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా, రాజశేఖర్ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి సిబ్బంది హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ వైద్యానికి రాజశేఖర్ స్పందిస్తున్నారని పేర్కొన్నారు.


Dear All.

Next Story

RELATED STORIES