సినిమా యుద్ధం : గెలిచేది థియేటరా? ఓటీటీనా?

సినిమా యుద్ధం :  గెలిచేది థియేటరా? ఓటీటీనా?
థియేటర్లు... ఓటీటీల మధ్య సినీ యుద్ధం జరుగుతోంది. వినాయకచవితికి థియేటర్లు, ఓటీటీల పోటాపోటీ రిలీజ్‌‌లు ఉన్నాయి.

థియేటర్లు... ఓటీటీల మధ్య సినీ యుద్ధం జరుగుతోంది. వినాయకచవితికి థియేటర్లు, ఓటీటీల పోటాపోటీ రిలీజ్‌‌లు ఉన్నాయి. హీరోల ఇమేజ్ అంతా సినిమాహాళ్ల పుణ్యమే అయినప్పుడు వాళ్లు ఓటీటీల్లో ఎలా రిలీజ్ చేస్తారన్నదే థియేటర్ యాజమాన్యాల ప్రశ్న. నాడు హిట్టుకు లెక్క.. థియేటర్లే! మరి నేడు?. సినీ రంగ పెద్దల మనసు ఎటువైపు ఉంది? సినిమా రంగానికి ఓటీటీలు వరమా? శాపమా? సినిమా యుద్ధంలో గెలిచేది థియేటరా? ఓటీటీనా?

కొత్త సినిమా వచ్చిందంటే.. పండగే. భారీ కటౌట్లు, బాణసంచా పేలుళ్లు, బ్యాండ్ మేళం దరువులు, స్వీట్ల పంపిణీ.. అబ్బో! ఇలా చాలా హంగామా ఉండేది. కానీ కరోణా వల్ల మొత్తం సీన్ మారిపోయింది. ఆర్ట్ ఫిలిమ్ చూసినట్టు ఇంట్లోనే ఓటీటీల్లో సినిమాలు చూడాల్సి వస్తోంది. నిన్నటి వరకు అది ఓకే. కానీ ఇప్పుడు మూతపడిన థియేటర్లు తెరుచుకున్నాయి. సినిమాల కోసం ఆవురావురుమని ఎదురుచూస్తున్నాయి. కానీ ఆ మూవీల్లో కొన్ని ఓటీటీ బాట పట్టడంతో గొడవ మొదలైంది. మరిప్పుడు ఏం జరగబోతోంది? దేశంలో థియేటర్ల నెలవారీ టిక్కెట్ వసూళ్లు దాదాపు 1000 కోట్ల రూపాయిలు. ఈ నెంబరే ఓటీటీలను ఆకర్షించిందా? అందుకే ప్రేక్షకులను తనవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేసిందా? ఇప్పుడు సీన్ ఎలా మారబోతోంది?

మన దేశంలో దాదాపు పదివేల స్క్రీన్లు ఉన్నాయి. వాటిలో రోజూ బొమ్మ పడితేనే సినిమా ఇండస్ట్రీ కాని, థియేటర్లు కాని కళకళలాడుతాయి. కానీ కరోనా వల్ల వాటిలో చాలావరకు మూతపడ్డాయి. ఇదే ఓటీటీకి వరంలా మారింది. అందుకే కొత్త సినిమాలను కోట్లు ఖర్చుపెట్టి మరీ కొంటున్నాయి. మరి థియేటర్ Vs ఓటీటీ అంటే.. ఎవరిది పైచేయి అవుతుంది? సినిమా పెద్దలు, ప్రేక్షకుల ఓటు ఎటు ఉంటుంది?

సినిమా అంటే వినోదం. దానిని వెండితెరపై పెద్దగా చూడాలని కోరుకోని వారు ఉండరు. ఇప్పటి తరం మొబైల్ స్క్రీన్ సైజ్ కి అలవాటు పడుతున్నా.. నిన్న, మొన్నటి తరాలు అలా చూడలేవు. పైగా థియేటర్లను నమ్ముకుని లక్షల కుటుంబాలు ఉన్నాయి. కాకపోతే వాళ్లు కూడా సినిమా హాల్ కి రావాలంటేనే జనాలు భయపడేలా చేయకూడదు. ఇటు ఓటీటీల్లో రిలీజ్‌‌లు చేయాలా వద్దా అన్నది.. సినీ నిర్మాతల ఇష్టమే అయినా... లాభం ఉంటుందీ అనుకుంటే.. థియేటర్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో తప్పులేదు. అందుకే కలిసికట్టుగా, సమిష్టిగా నిర్ణయం తీసుకుంటేనే అది ఇండస్ట్రీకి, ఓటీటీకీ మంచిది.

Tags

Read MoreRead Less
Next Story