Cinema: సైలెంట్ గా వచ్చేస్తున్న సత్తిగాడు...

Cinema: సైలెంట్ గా వచ్చేస్తున్న సత్తిగాడు...
ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనున్న సత్తిగాని రెండు ఎకరాలు...

తెలుగువారికి రొటీన్ కు భిన్నమైన కాన్సెప్టులను అందిస్తూ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఆవిస్కరిస్తోన్న ఆహా తాజాగా మరో కథను చెప్పేందుకు సిద్ధమవుతోంది. 'సత్తిగాని రెండు ఎకరాలు' ఒరిజినల్ మూవీతో మన మందుకు రాబోతోంది. జగదీశ్ ప్రతాప్ బంఢారీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ డార్క్ కామెడీ మూవీ మార్చ్ 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ మూవీలో ప్రముఖ కమెడియన్ పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రలో సరికొత్తగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అభినవ్ దండా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డార్క్ కామెడీ ఫిల్మ్ లో ఎవరూ ఊహించని ట్విస్టులు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. కొల్లూరు బ్యాక్ డ్రాప్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక జగదీశ్, వెన్నల కిశోర్ తోపాటూ బిత్తిరి సత్తి, మోహన శ్రీ సురాగా, రాజ్ తిరాన్దసు, ఆనీశా దామా కీలక పాత్రలు పోషించారు.

Tags

Read MoreRead Less
Next Story