Cinema: సురేశ్ బాబు చేతుల మీదుగా 'అన్నపూర్ణా ఫోటో స్టూడియో'
వింటేజ్ లవ్ స్టోరీలకు విపరీతమైన ఆదరణ నెలకొన్న సమయంలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని హంగులతో ముస్తాబయి వచ్చేస్తోంది అన్నపూర్ణా ఫొటో స్టూడియో. ఇచ్చట అందమైన ఫొటోలు తీయబడును అన్నది ఉపశీర్షిక. 30వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ కోవలోనే చందు మొద్దు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు విడుదల చేశారు. చిత్ర బృందాని అభినందనలు తెలియజేశారు. 1980ల బ్యాక్ డ్రాప్ లో గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక సినీ లవర్స్ కు కావాల్సినన్ని ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు చందు చెబుతున్నారు. మరి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com