Cinema: మరో వారసుడు, హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు
By - Chitralekha |23 March 2023 9:42 AM GMT
హీరో మాధవ్ పై క్లాప్ కొట్టిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు; డైరెక్టర్ గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
మాస్ మహారాజ్ రవితేజ తమ్ముడు రఘు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన తనయుడు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. జేజేఆర్ ఎంటర్టైనర్స్ పతాకంపై మాధవ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి పెళ్లి సందడి ఫేమ్ గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజే పూజా కార్యక్రమం జరుపుకుంది. టైటిల్ ఇంకా ఖరారు అవ్వాల్సి ఉండగా, హీరో మాధవ్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తొలి షాట్ కు క్లాప్ కొట్టి లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు. మరి పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గౌరీ, ఈ సినిమాతో ఎలాంటి వినోదం పంచబోతున్నారో చూడాలి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com