Cinema: మిస్ శెట్టి బాధేంటి!?

ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న నోనోనో సాంగ్

మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి నుంచి ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతున్న అప్ డేట్స్ ప్రేక్షకులకు సినిమాపై రోజురోజుకూ మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయనే చెప్పాలి. చాలా రోజుల తరువాత టాలీవుడ్ స్వీట్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న సినిమా కావడం ఇందుకు ఒక కారణం కాగా, క్రేజీ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ మరో కారణం అని చెప్పాలి. ప్రేక్షకుల్లో ఈ కాంబినేషన్ పైనే ఎక్కువ క్యూరియాసిటీ నెలకొని ఉందని చెప్పాలి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన నోనోనో సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రాడాన్ స్వరాలు సమకూర్చగా, ఎంఎం మానసి ఈ పాటను ఆలపించారు. మరి స్వీటీ, నవీన్ జంట ప్రేక్షకులకు ఎప్పుడు గిలిగింతలు పెడుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story