Cinema: ఖుషీ రిలీజ్ డేట్.... ఆ రోజేనట

Cinema: ఖుషీ రిలీజ్ డేట్.... ఆ రోజేనట
సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విజయ్ దేవరకొండ, సమంత ఖుషీ విడుదల


సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తోన్న మూవీ ఖుషీ. అందమైన ప్రేమకథగా రూపొందిన ఈ మూవీ ఇప్పటికే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న జనాలు, షూటింగ్ కొన్నిరోజులు వాయిదా పడటంతో కాస్త నిరుత్సాహ పడ్డారు. అయితే, తాజాగా విడుదులైన అప్ డేట్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఖుషీ రిలీజ్ డేట్ ను చిత్రబృందం అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఖుషీ రిలీజ్ అవ్వబోతున్నట్లు ప్రకటించింది. బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ తో సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై తనదైన మ్యాజిక్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. కశ్మీర్ తో పాటు ఎన్నో అందరమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ - సమంత కాంబినేషన్ ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తీర్చి దిద్దుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story