Cinema: నచ్చావులే నచ్చావులే అంటోన్న తేజ్

Cinema: నచ్చావులే నచ్చావులే అంటోన్న తేజ్
విరూపాక్ష పాటకు నెటిజెన్లు ఫిదా

సాయిధరమ్ తేజ్, సంయుక్త జంటగా నటిస్తోన్న మూవీ విరూపాక్ష. కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి విడుదలవుతున్న ఓక్కో అప్ డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కోవలో తాజాగా విడుదలైన నచ్చావులే నచ్చావులే సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసేస్తోంది. పల్లెటూరి పిల్లలా సంయుక్త అందాలతో పాటూ, తేజ్ యాక్టింగ్ ఈ సాంగ్ కు ప్లస్ పాయింట్లుగా మారాయని చెప్పాల్సిందే. అంజనీశ్ లోక్ నాథ్ స్వరాలు సమకూర్చగా, కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. కార్తిక్ ఆలపించిన ఈ పాట శ్రోతలకు గిలిగింతలు పెడుతోందని చెప్పాల్సిందే. మరి శ్రీవెంకటేశ్వరా సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతోన్న విరూపాక్ష ప్రేక్షకులను ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story