Cinema: వచ్చేస్తున్నా కాస్కోండి

Cinema: వచ్చేస్తున్నా కాస్కోండి
మార్చ్ 28న రావణాసుర ట్రైలర్; పూనకాలు తెప్పించనున్న మాస్ మాహారాజ

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న రావణాసుర మువీ కోసం ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రవితేజ తొలిసారి విభిన్నమైన పాత్రలో కనిపించడం, సదరు పాత్రకు నెగిటివ్ షేడ్ జోడించడం జనాల్లో ఎనలేని ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి తోడు టైటిల్ కూడా విభిన్నంగా ఉండటంతో ఈసారి మాస్ మహారాజ్ బాక్సాఫీస్ ఢంగా భజాయించడం గ్యారెంటీ అని భావిస్తున్నారు ట్రేడ్ వర్గాలు. మరోవైపు ఈ సినిమాలో అందాల తారలు బారులు తీరారనే చెప్పాలి. అనూ ఇమాన్యుయెల్, ఫారియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్, దక్ష, పూజిత పొన్నాడ వంటి ముద్దుగుమ్మలు కనువిందు చేస్తున్నారు. హీరో సుశాంత్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తోన్న రావణాసుర ట్రైలర్ మార్చ్ 28న రిలీజ్ అవ్వబోతోందని చిత్ర బృందం ప్రకటించింది. మరి టీజర్ తోనే క్యూరియాసిటీని పెంచేసిన రావణాసుర ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story