Cinema: దాసు మరో సినిమా షురూ...!

Cinema: దాసు మరో సినిమా షురూ...!
విశ్వక్ సేన్ పుట్టినరోజు కానుకగా కొత్త చిత్రం ప్రకటన; సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.21 గా విశ్వక్ సేన్ 11వ చిత్రం

దాస్ కా దమ్కీతో డైరెక్టర్ గానూ తన సత్తా చాటుకున్న విశ్వక్సేన్ ఈ ఊపులోనే మరో సినిమా మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. నేడు పుట్టిన రోజు పురస్కరించుకుని సితార సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.21 గా కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో కూడా ఆసక్తికరంగా ఉంది. గోదావరి తీర ప్రాంతంలో ఈ చిత్రం తెరకెక్కబోతోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోందని తెలుస్తోంది. ఏమైనా వరుస విజయాలతో మాంచి ఊపు మీద ఉన్న విశ్వక్ మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story