Cinema: అక్కడ కూడా కోటి కొట్టేశాడు....

Cinema: అక్కడ కూడా కోటి కొట్టేశాడు....
ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్ బుక్ లో మహేశ్ బాబుదే హవా...

సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాడు. అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ కోటికి పైగా ఫాలోవర్లు సంపాదించుకున్న ఏకైక స్టార్ హీరోగా మరో కొత్త రికార్డ్ ను నెలకొల్పాడు. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ లో కోటి ఫాలోవర్ల మార్క్ ను దాటేసిన మహేశ్ బాబు, తాజాగా ఇన్స్టాలో కూడా కోటిని కొట్టేశాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ రకమైన ఫాలోవర్లు ఉన్న హీరో మనోడొక్కడే కావడం విశేషం. ప్రిన్స్ సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా ఫోటోలు పెట్టడం, ఎప్పటికప్పుడు కొత్త ముచ్చట్లను అభిమానులతో షేర్ చేసుకుంటూ యాక్టివ్ గా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలవ్వబోతోంది.



Tags

Read MoreRead Less
Next Story