మరోసారి ఊపందుకున్న సుధీర్, రష్మీ పెళ్లి ఊహాగానాలు

మరోసారి ఊపందుకున్న సుధీర్, రష్మీ పెళ్లి ఊహాగానాలు
నిజంగానే వీరిద్ద‌రు పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా..? అన్న ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి.

సుధీర్, రష్మీ.. బుల్లితెరపై ఈ జంట చేసే హడావుడి మాములుగా ఉండదు. ఈ జంట బుల్లితెరపై పెళ్లిచేసుకుంటే టిఆర్పీ రేటింగ్స్ పరుగులు పెడుతూ ఉంటాయి.అందుకే వీళ్లతో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ఛానెల్స్ కూడా పోటీ పడుతుంటాయి. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ వీరిద్ద‌రితో ఇప్ప‌టికే చాలా షోలు చేసి సక్సెక్ అయింది. ఈ క్రమంలోనే మ‌రోసారి వీరిద్ద‌రి పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది.

ఓ ప్రముఖ కామెడీ షోలోని స్కిట్‌లో సుధీర్ పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ఉండ‌గా.. ఆ షో జ‌డ్జి రోజా మ‌రోసారి.. సుధీర్, ర‌ష్మి ద‌గ్గ‌ర పెళ్లి ప్ర‌స్తావ‌న‌ను తీసుకొచ్చారు. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు.? మీ పెళ్లికి వ‌చ్చేందుకు మేము రెడీగా ఉన్నామన్నారు రోజా. దీంతో సుధీర్‌ పక్కనే ఉన్న రష్మి వైపు చూసి చిరునవ్వులు చిందించాడు. అనంతరం రోజా.. రష్మిని సైతం ఇదే ప్రశ్న వేయగా.. ఆమె కూడా సుధీర్‌ వైపు చూసి సిగ్గుపడింది. వెంటనే ఇంకా టైమ్ ఉంద‌ని సుధీర్ బదులు ఇచ్చాడు. దీంతో రోజా సెటైరు వేస్తూ.. ఇంకెప్పుడు.. ఇప్ప‌టికే ముదిరిన బెండ‌కాయ‌లా ఉన్నావ‌ని అన‌డం.. ర‌ష్మి న‌వ్వ‌డం.. వారిద్ద‌రి మ‌ధ్య బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేయ‌డం.. ఆ షోలో ప్రోమోగా చూపించారు.

ఇది ఇలాఉంటే నిజ జీవితంలో కూడా వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటే చూడాల‌ని చాలా మంది ఫ్యాన్స్‌ కూడా ఎదురుచూస్తున్నారు. తామిద్దరం గుడ్ ఫ్రెండ్స్ అని ప్రతిసారి చెబుతున్నప్పటికీ.. వీక్ష‌కుల‌కు మాత్రం ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జరుగుతున్నట్లు బావిస్తుంటారు. ర‌ష్మిని త‌న ల‌క్కీ ప‌ర్స‌న్‌గా చెబుతుంటాడు సుధీర్. సమయం వచ్చిన ప్రతిసారి రష్మీపై తనకున్న ప్రేమ‌ను చూపిస్తుంటాడు. అయితే పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ ప్రతిసారి ఖండిస్తూ వచ్చిన ఈ జంట.. ఇప్పుడు మాత్రం కాస్త సానుకూలంగా ఉండ‌టంతో.. నిజంగానే వీరిద్ద‌రు పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా..? అన్న ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story