బ్రహ్మానందం రెండో కొడుకు హీరోగా..

విదేశాల్లో చదువుకుంటున్న సిద్దార్థ్ ఇటీవల ఇండియాకు తిరిగి రావడంతో ..

బ్రహ్మానందం రెండో కొడుకు హీరోగా..
X

స్టార్ కమెడియన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలేస్తున్న బ్రహ్మానందం తన పెద్ద కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 2004లో వచ్చిన పల్లకిలో పెళ్లి కూతురు చిత్రంతో రాజా గతమ్ పరిచయం అయ్యారు. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో సుచిత్ర చంద్రబోస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు వారెవా, మను చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో గౌతమ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.

ఇక బ్రహ్మీ రెండో కొడుకు సిద్ధార్థ్ కూడా సినిమా ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. విదేశాల్లో చదువుకుంటున్న సిద్దార్థ్ ఇటీవల ఇండియాకు తిరిగి రావడంతో బ్రహ్మీ అతడిని కూడా హీరోగా పరిచయం చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది.

అయితే మొదటి కొడుకు రాజా గౌతమ్ సినిమాల్లో రాణించకపోవడంతో రెండో కొడుకు ఎంట్రీ గురించి ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. సిద్ధార్థకి కూడా బిజినెస్ రంగం వైపు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

Next Story

RELATED STORIES