'దాక్కో దాక్కో మేక'.. పుష్ప నుంచి సాంగ్ వచ్చేసింది..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

దాక్కో దాక్కో మేక.. పుష్ప నుంచి సాంగ్ వచ్చేసింది..!
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా లోని 'దాక్కో దాక్కో మేక...' పాటని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. మొత్తం ఐదు భాషల్లో ఈ పాట విడుదల కాగా తెలుగులో శివం, హిందీలో విశాల్‌ దడ్లాని, కన్నడంలో విజయ ప్రకాష్‌, తమిళంలో బెన్నీ దయాల్‌, మలయాళంలో రాహుల్‌ నంబియార్‌ పాటని ఆలపించారు.

ఈ పాట బన్నీ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ పాటలో బన్నీ అల్లు అర్జున్‌ కనిపించే విధానం హైలెట్ కానుందని సినీ వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా మొదటిసారిగా హీరోయిన్ గా నటిస్తుంది. ఫహాద్‌ ఫాజిల్‌ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా మొదటి భాగాన్ని క్రిస్మస్‌ సందర్భంగా విడుదల చేయనున్నారు. అల వైకుంఠపురములో తరవాత బన్నీ నుంచి సినిమా, రంగస్థలం తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.Next Story

RELATED STORIES