Ravi Teja: రవితేజకు, నిర్మాతకు మధ్య మనస్పర్థలు.. అందుకే సినిమాపై ఎఫెక్ట్..

Ravi Teja: రవితేజకు, నిర్మాతకు మధ్య మనస్పర్థలు.. అందుకే సినిమాపై ఎఫెక్ట్..
Ravi Teja: రెమ్యునరేషన్ విషయంలో కొందరు హీరోలు చాలా కఠినంగా ఉంటారు. అలాంటి వారిలో రవితేజ ఒకరు.

Ravi Teja: ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని.. ప్రేక్షకుల ముందుకు వచ్చేవరకు చాలా ప్రాసెస్ ఉంటుంది. అయితే కోవిడ్ కారణంగా సినిమాలు చాలావరకు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అంతా మామూలు అయిపోయినా కూడా రవితేజ సినిమా మాత్రం అలాగే వాయిదాలపాలవుతోంది. అయితే దీని వెనుక కారణం మరొకటి ఉందని ఫిల్మ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మాస్ మహారాజా రవితేజ కెరీర్ మూడు హిట్లు, ఆరు ఫ్లాపులు అన్నట్టుగా కొనసాగుతోంది. అయితే తాను మాత్రం హిట్, ఫ్లాప్ అనేది ఏమీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం రవితేజ దాదాపు నాలుగు సినిమాలను ఒకేసారి ప్రారంభించాడు. ఇదిలా ఉండగా అన్నింటికంటే ముందుగా రావాల్సిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం మరోసారి వాయిదా పడడంపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి.


రెమ్యునరేషన్ విషయంలో కొందరు హీరోలు చాలా కఠినంగా ఉంటారు. అలాంటి వారిలో రవితేజ ఒకరు. అయితే రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి కూడా బిజినెస్‌ను బట్టి రెమ్యునరేషన్ అని నిర్ణయించారట. ఫస్ట్ లుక్ విడుదలయినప్పటి నుండి మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో ముందుగా ఒప్పుకున్న దాని ప్రకారం తన వాటా తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడట రవితేజ. కానీ నిర్మాత ఇంకా చేతికి డబ్బులు రాలేదని చెప్పడంతో రవితేజకు, నిర్మాతకు మధ్య మనస్పర్థలు వచ్చాయని.. అదే సినిమా వాయిదాలకు కారణమవుతోందని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story