ఈ వి.వి వినాయక్ హీరోయిన్‌‌ని గుర్తుపట్టారా.. ఇప్పుడెలా ఉందో చూడండి ?

ఇండస్ట్రీలో హీరోయిన్స్ టైం పీరియడ్ వెరీ షార్ట్.. ఫేం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కానీ అందరికీ ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు.

ఈ వి.వి వినాయక్ హీరోయిన్‌‌ని గుర్తుపట్టారా.. ఇప్పుడెలా ఉందో చూడండి ?
X

ఇండస్ట్రీలో హీరోయిన్స్ టైం పీరియడ్ వెరీ షార్ట్.. ఫేం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కానీ అందరికీ ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. కొందరు హీరోయిన్లు ఒక రెండు సినిమాలతో ఫెడ్‌‌అవుట్ అయిపోతారు. ఆలాంటి జాబితా కిందికే వస్తుంది నేహబాంబ్... ఈ పేరు చెబితే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు.. దిల్ సినిమా హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు. నితిన్ సరసన నందిని అనే పాత్రలో నటించింది ఈ బ్యూటీ. ఈ సినిమా హిట్ కావడంతో అమ్మడు వరుస హిట్లు కొడుతుందని అనుకున్నారంతా.. కానీ అందుకు భిన్నంగా ఆమె కెరీర్ సాగింది. అతడే ఒక సైన్యం, దోస్త్‌ చిత్రాలు నిరాశపరిచాయి.


దీనితో సైడ్‌ క్యారెక్టర్‌ పాత్రలు చేయడానికి కూడా సిద్దమైంది. అలా బొమ్మరిల్లు, దుబాయ్ శీను సినిమాలలో నటించింది. కానీ ఇవేమీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేసింది కానీ అక్కడ కూడా మొండి చేయి ఎదురైంది. ఈ క్రమంలో కైసే యే ప్యార్‌ హై సీరియల్‌తో బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది. సీరియల్స్ లలో నటిస్తూనే పలు షోలకి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే నేహ బాంబ్ రిషిరాజ్‌ జవేరీని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే మళ్ళీ ఈ భామ తెలుగు సినిమాలలో ఎప్పుడు నటిస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Next Story

RELATED STORIES