F3లో మూడో హీరో... దర్శకుడి క్లారిటీ!

F3లో మూడో హీరో... దర్శకుడి క్లారిటీ!
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం "ఎఫ్ 2".. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టైందో అందరికీ తెలిసిందే.

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం "ఎఫ్ 2".. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుంది. ఎఫ్ 2 మూవీని నిర్మించిన దిల్ రాజే ఈ సీక్వెల్ ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్..

'ఎఫ్2' లో భార్యల మ‌న‌స్తత్వం వల్ల కుటుంబంలో గొడ‌వ‌లు జ‌రిగితే ఎలా ఉంటుందో చూపిస్తే.. 'ఎఫ్ 3'లో డ‌బ్బు వ‌ల్ల కుటుంబాల్లో ఎలాంటి మార్పులు జ‌రిగాయ‌నేది ఈ సీక్వెల్‌లో చూపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరో కూడా నటించబోతున్నట్లుగా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడో హీరోగా చాలా మంది పేర్లు వినిపించాయి.

ముఖ్యంగా రవితేజ, సాయి ధరమ్ తేజ్, గోపీచంద్ పేర్లు వినిపించాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పందించారు. అసలు ఈ సినిమాలో మూడో హీరో అనే ఆలోచన లేదని వెల్లడించాడు. ఎఫ్ 2 లాగే ఎఫ్ 3 లో కూడా ఇద్దరు హీరోలే నటిస్తారని వెల్లడించాడు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, సినిమాని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story