డైరెక్టర్ తేజకి మరో ఉదయ్‌కిరణ్‌ దొరికేశాడు..!

శివ సినిమాతో సినిమాటోగ్రఫర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ.. ఆ తర్వాత చిత్రం సినిమాతో డైరెక్టర్ గా మారాడు.

డైరెక్టర్ తేజకి మరో ఉదయ్‌కిరణ్‌ దొరికేశాడు..!
X

శివ సినిమాతో సినిమాటోగ్రఫర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ.. ఆ తర్వాత చిత్రం సినిమాతో డైరెక్టర్ గా మారాడు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే ఉదయ్‌కిరణ్‌, రీమాసేన్‌ హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత జయం, జై లాంటి సంచలన చిత్రాలను తీశాడు తేజ.

అలాంటి తేజ.. గత కొన్ని సంవత్సరాలుగా హిట్లు లేక సతమతం అవుతున్నాడు. అయితే తనని డైరెక్టర్ గా నిలబెట్టిన చిత్రం సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు తేజ.. అంతా కొత్తవాళ్ళతోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు తేజ... తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాతో తేజ తన కొడుకు అమిత‌వ్ తేజని హీరోగా పరిచయం చేయనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం విదేశాల్లో శిక్షణ కూడా ఇప్పిస్తున్నాడట తేజ.

దీనిపైన త్వరలోనే అధికార ప్రకటన రానుంది. కాగా ఈనెల 18న ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Next Story

RELATED STORIES