నా వరుస ప్లాప్ సినిమాలకి ఆ సినిమా పునాది : తేజ

చిన్న బడ్జెట్, ఫ్రెష్ తారాగణం, భారీ హిట్ ఈ పదాలు వింటుంటే మనకి టక్కున గుర్తొచ్చే డైరెక్టర్ పేరు తేజ.. కెమరామెన్‌‌గా సినీ కెరీర్ మొదలుపెట్టిన తేజ..

నా వరుస ప్లాప్ సినిమాలకి ఆ సినిమా పునాది : తేజ
X

చిన్న బడ్జెట్, ఫ్రెష్ తారాగణం, భారీ హిట్ ఈ పదాలు వింటుంటే మనకి టక్కున గుర్తొచ్చే డైరెక్టర్ పేరు తేజ.. కెమరామెన్‌‌గా సినీ కెరీర్ మొదలుపెట్టిన తేజ.. ఆ తర్వాత చిత్రం సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాతోనే ఉదయ్‌‌కిరణ్ లాంటి టాలెంటెడ్ హీరో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టిన తేజకి స్టార్ హీరోలతో సినిమాలు వచ్చాయి. కానీ మళ్ళీ స్టార్ లని కాకుండా కొత్తకొత్త వాళ్ళతోనే సినిమాలను చేసి బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టారాయన.

నువ్వు నేను, జయం సినిమాలతో తేజ స్టార్ డైరెక్టర్‌‌ల లిస్టులో ఒకరిగా నిలిచారు తేజ. ఈ సినిమాల తరవాత మహేష్ బాబుతో నిజం సినిమాని చేశారు తేజ. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాభావాన్ని చవిచూసింది. అయితే తాజాగా ఓ ఛానల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడిన తేజ.. తన వరుస ప్లాప్ సినిమాలకి ఈ సినిమా పునాది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ప్లాప్‌‌కి ఎవరు కారణం కాదని కేవలం విధి మాత్రమేనని చెప్పుకొచ్చారు.

మహేష్‌‌బాబు బాబీ సినిమా తర్వాత ఈ సినిమా చేయాలనీ కానీ మధ్యలో ఒక్కడు సినిమా రావడంతో మహేష్ లెవెల్ మారిపోయిందని అన్నారు. స్టార్ అయిన మహేష్‌‌ ఇమేజ్‌‌ని నిజం సినిమా బ్యాలెన్స్ చేయలేకపోయిందని అన్నారు. ఒకవేళ ఈ సినిమాని ఓ కొత్త హీరోతో తీసుంటే హిట్ అయ్యేదని తెలిపారు. కానీ ఈ సినిమా కోసం మహేష్‌‌బాబు బాగానే కష్టపడ్డాడని అన్నారు. ఈ సినిమాలో మహేష్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ మరో హీరో కూడా ఇవ్వలేడని అభిప్రాయపడ్డారు.

Next Story

RELATED STORIES