మాటల మాంత్రికుడి క్యూట్ లవ్ స్టొరీ.. సౌజన్యతో ప్రేమ, పెళ్లి ఇలా!

సినిమాల్లో ఎన్నో ప్రేమ కథలు, ప్రేమకి సంబంధించిన సంభాషణలను చెప్పిన త్రివిక్రమ్ జీవితంలో కూడా ఓ చిన్న సైజ్ లవ్ స్టొరీ ఉందట.. గతంలో త్రివిక్రమ్ దగ్గరి సన్నిహితులు చెప్పిన వివరాల ప్రకారం..

మాటల మాంత్రికుడి క్యూట్ లవ్ స్టొరీ.. సౌజన్యతో ప్రేమ, పెళ్లి ఇలా!
X

పొదుపుగా పదాలను వాడుతూనే లోతైన భావాన్ని చెప్పడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాతే ఎవరైనా.. స్వయంవరం సినిమాతో మాటల రచయితగా మొదలైన అయన సినీ ప్రయాణం.. ఇప్పుడు టాప్ డైరెక్టర్ లలో ఒకరిని చేసింది. అయిన సినీ జీవితం తెరిచిన పుస్తకమే.. కానీ అయన పర్సనల్ లైఫ్ గురించి అంతగా ఎవరికీ తెలియదు.

సినిమాల్లో ఎన్నో ప్రేమ కథలు, ప్రేమకి సంబంధించిన సంభాషణలను చెప్పిన త్రివిక్రమ్ జీవితంలో కూడా ఓ చిన్న సైజ్ లవ్ స్టొరీ ఉందట.. గతంలో త్రివిక్రమ్ దగ్గరి సన్నిహితులు చెప్పిన వివరాల ప్రకారం.. త్రివిక్రమ్, సౌజన్యల వివాహం 2002లో జరిగింది. ఈ సౌజన్య ఎవరో కాదు.. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కుమార్తె..


అయితే నిజానికి త్రివిక్రమ్... సౌజన్య అక్కని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్లారట.. కానీ అక్కడ త్రివిక్రమ్ కు సౌజన్య నచ్చారట.. ఇదే విషయాన్ని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ముందుగా ఆశ్చర్యపోయిన.. ఆ తరవాత సీతారామశాస్త్రికి నచ్చిన అబ్బాయి, ఎలాంటి చెడు అలవాట్లు లేనివాడు కావడంతో ఒప్పెసుకున్నారట.

కానీ పెద్ద అమ్మాయి పెళ్లి తర్వాతే చిన్నమ్మాయికి పెళ్లి చేస్తామని కండిషన్ పెట్టారట.. ఆలా ఓ సంవత్సరం తరవాత మూడుముళ్ల బంధంతో త్రివిక్రమ్, సౌజన్య ఒకటయ్యారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్రివిక్రమ్ భార్య సౌజన్య మంచి క్లాసికల్ డాన్సర్. పలు వేదికలపై ఆమె డాన్స్ షోలు కూడా చేశారు.

Next Story

RELATED STORIES