Trivikram Srinivas: సొంతిల్లున్నా ఇంకా ఆ అద్దె ఇంటికి రెంటు..!

Trivikram Srinivas: సొంతిల్లున్నా ఇంకా ఆ అద్దె ఇంటికి రెంటు..!
ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్ తో కూడుకున్నది.. .ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఆలాగే స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఓ సెంటిమెంట్ ఉంది.

ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్ తో కూడుకున్నది.. .ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఆలాగే స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఓ సెంటిమెంట్ ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటుడు సునీల్, దర్శకుడు దశరథ్, ఆర్పీ పట్నాయక్ లతో కలిసి పంజాగుట్టలోని సాయిబాబా ఆలయానికి సమీపంలో ఉండే ఓ చిన్న గదిలో అద్దెకు ఉండేవారు. ఇక్కడినుంచే స్వయంవరం, సముద్రం, నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి కథలు, మాటలు అందించారు త్రివిక్రమ్. ఆ తర్వాత దర్శకుడిగా మారి ఆయనకంటూ ఓ సొంతిల్లు కొనుకున్నారు. అయితే త్రివిక్రమ్ కి అద్దెకి ఉన్న ఇల్లంటే ఎంతో సెంటిమెంట్ ఇప్పటికీ ఆ రూమ్ కి ప్రతి నెల ఐదు వేల రూపాయల అద్దె చేల్లిస్తారట. అంతేకాకుండా ఇప్పటికీ కొన్ని సినిమాలకు అక్కడే కూర్చొని కథలు, మాటలు రాస్తారట. ఇక త్రివిక్రమ్, సునీల్ ఎప్పుడైనా కలిసి మాట్లాడుకోవాలని అనుకుంటే అక్కడికి వెళ్లి మాట్లాడుకుంటారట. ఈ విషయాన్ని త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Tags

Read MoreRead Less
Next Story