బ్రేకింగ్.. టాలీవుడ్‌పై నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు

అలాంటి కారణాల వల్లే తాను అగ్రహీరోలతో ఎక్కువ సినిమాలు చేయలేకపోయానన్నారు.

బ్రేకింగ్.. టాలీవుడ్‌పై నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు
X

టాలీవుడ్‌పై నటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా ఉందని అన్నారు. ఇటీవల వస్తున్న సినిమాలు పిల్లలతో కలిసి చూసేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రంగంతోపాటు ఇంకొన్ని చోట్లా మహిళలకు చాలా ఇబ్బందులున్నాయని అన్నారు. అలాంటి కారణాల వల్లే తాను అగ్రహీరోలతో ఎక్కువ సినిమాలు చేయలేకపోయానన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఫైన్‌ఆర్ట్స్ కాలేజీలో పిల్లలు డ్రగ్స్‌కు బానిసలు కావడం చూస్తే భయమేస్తోందన్నారు దివ్యవాణి. తెలంగాణలో మహిళ కమిషన్ ఏర్పాటుపై TDP అనుబంధ విభాగమైన తెలుగు మహిళ ఆధ్వర్యంలో చేపట్టిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు అంశంతోపాటు భద్రత కల్పించే అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని MLA సీతక్క కోరారు. TDP అధ్యక్షుడు L.రమణతోపాటు BJP, కాంగ్రెస్‌లకు చెందిన లీడర్లు, వివిధ ప్రజా, పౌర సంఘాల ప్రతినిధులు కూడా ఈ రౌండ్ టేబుల్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమలో కొందరు డ్రగ్స్ వినియోగించడంపే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. టాలీవుడ్‌పై దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

Next Story

RELATED STORIES