బద్రి సినిమాలో ఈ పాప గుర్తుందా.. ఇప్పుడు హీరోయిన్.. ఎవరి కూతురో తెలుసా?

పవన్ స్టైల్, పూరి టేకింగ్, రమణ గోగుల పాటలు సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో పవన్‌తో ఓ పాప మాట్లాడుతూ ఉంటుంది.

బద్రి సినిమాలో ఈ పాప గుర్తుందా.. ఇప్పుడు హీరోయిన్.. ఎవరి కూతురో తెలుసా?
X

పవన్ కళ్యాణ్, అమిషా పటేల్, రేణుదేశాయ్‌లు హీరోహీరోయిన్లుగా వచ్చిన బద్రి సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే... ఈ సినిమా తోనే పూరి జగన్నాధ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.


పవన్ స్టైల్, పూరి టేకింగ్, రమణ గోగుల పాటలు సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో పవన్‌తో ఓ పాప మాట్లాడుతూ ఉంటుంది. నాకు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ పవన్ తో మాట్లాడిన ఆ పాప ఇప్పుడు హీరోయిన్ అయిపొయింది.


2017 లో వచ్చిన "పిచ్చి గా నచ్చావ్" సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ పాప ఎవరో కాదు.. నటుడు ఉత్తేజ్ కూతురు చేతన. ప్రస్తుతం చేతన పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

Next Story

RELATED STORIES