బ్రేకింగ్.. డ్రగ్స్ కేసుతో టాలీవుడ్‌ హీరోయిన్‌కు లింకులు..

రియా కాల్‌ డేటాలో పలువురు ప్రముఖుల లిస్ట్‌ తెరపైకి వచ్చింది. నటి సారా అలీఖాన్‌, రకుల్ ప్రీత్ సింగ్‌..

బ్రేకింగ్.. డ్రగ్స్ కేసుతో టాలీవుడ్‌ హీరోయిన్‌కు లింకులు..
X

సుశాంత్ సింగ్‌ ఆత్మహత్యతో ముడిపడి ఉన్న డ్రగ్స్‌ కేసు.. బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. NCB కస్టడీలో ఉన్న సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారిస్తున్న కొద్దీ అనేక మంది ప్రముఖుల పేర్లు బయటికి వస్తున్నాయి. తాజాగా... రియా కాల్‌ డేటాలో పలువురు ప్రముఖుల లిస్ట్‌ తెరపైకి వచ్చింది. నటి సారా అలీఖాన్‌, రకుల్ ప్రీత్ సింగ్‌, డిజైనర్‌ సైమొనె ఖంబట్టా, సుశాంత్ మాజీ మేనేజర్‌ రిహిణి అయ్యర్‌, ఫిల్మ్ మేకర్‌ ముకేష్‌ ఛాబ్రా డ్రగ్స్‌ తీసుకున్నట్టు.. నార్కోటిక్స్ అధికారుల విచారణలో రియా వెల్లడించినట్టు సమాచారం. రియా చెప్పిన పేర్లలో టాలీవుడ్‌ లింక్‌లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బయటికి వచ్చిన పేర్లతోపాటు... ఇంకా చాలా మంది ప్రముఖులు బాలీవుడ్ డ్రగ్స్ స్కాండల్‌లో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే వారందరికీ NCB అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు.

మరోవైపు నార్కోటిక్స్‌ అధికారులు ముంబై, గోవాలోని ఏడు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో పలు కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి పలువురు ప్రముఖుల పేర్లు వస్తుండంటంతో.. NCB అధికారులు ముంబైలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. డ్రగ్స్‌ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి 14 రోజుల NCB కస్టడీలో ఉంది. బాలీవుడ్‌లో సుమారు 80 శాతం మంది నటీనటులు... డ్రగ్స్‌ తీసుకుంటారని విచారణలో.. NCB అధికారులకు రియా వెల్లడించింది. రియా ఇచ్చిన లిస్ట్‌లో కనీసం 15 మంది NCB రాడార్‌లో ఉన్నారు. వీళ్లలో చాలా మంది బీ - కేటగిరి ఆర్టిస్టులని సమాచారం.

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ తీసుకుంటున్నవారినిలో కొందరు సరఫరాదారులు కాగా.. మరికొందరు వినియోగించేవారని విచారణలో బయటికి వచ్చింది. బాలీవుడ్ హై ప్రొఫైల్‌ పార్టీలు అరేంజ్‌ చేసేవారిలోనూ డ్రగ్స్‌ సప్లయర్స్ ఉన్నట్టు NCB అధికారులు గుర్తించారు. రియా సోదరుడు షోవిక్‌ విచారణలోనూ పలు ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. లాక్‌డౌన్ టైమ్‌లో కొరియర్ సర్వీసుల ద్వారా.. సుశాంత్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు షోవిక్‌ అంగీకరించాడు. ఈ ఘటనలో పలువురు కొరియర్లను కూడా అధికారులు అరెస్టు చేశారు. షోవిక్‌, కొరియర్‌ బాయ్‌కి మధ్య జరిగిన కాల్‌ డేటాను కూడా... NCB అధికారులు సేకరించారు. విచారణ కొనసాగుతున్న కొద్దీ.. మరింతమంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంది. అటు నిన్న రియా బెయిల్‌ తిరస్కరించడంతో... NCB అధికారులు పూర్తిస్థాయిలో వివరాలు రాబట్టే పనిలో బిజీగా ఉన్నారు.

Next Story

RELATED STORIES