రౌడీ వచ్చేస్తున్నాడోచ్!

పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా పైన ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి రేపు ఓ అప్ డేట్ ని ఇవ్వనున్నట్టుగా చిత్రబృందం వెల్లడించింది.

రౌడీ వచ్చేస్తున్నాడోచ్!
X

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా పైన ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి రేపు ఓ అప్ డేట్ ని ఇవ్వనున్నట్టుగా చిత్రబృందం వెల్లడించింది. సోమవారం ఉదయం 10.08 గంటలకు టైటిల్ కం ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సార్ గా కనిపించనున్నాడు. భాషలకు అతీతంగా అందరినీ అలరించేందుకు సినిమా రెడీ అవుతోందని చిత్ర బృందం తెలిపింది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరవాత పూరి నుంచి వస్తున్న సినిమా కావడంతో రౌడీ అభిమానులు ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Next Story

RELATED STORIES